karthika Deepam: నాన్న ఏదో తప్పు చేసిన వాడిలా ప్రవర్థిస్తున్నాడు..

15 Jun, 2021 14:32 IST|Sakshi

కార్తీకదీపం జూన్‌ 15:  దీప దీర్ఘంగా ఆలోచిస్తూ బయట కూర్చుంటే హిమ వచ్చి ఏమైందని, నువ్వు డాడీ ఎందుకలా ఉంటున్నారని ప్రశ్నిస్తుంది. ఈ లోపు అక్కడికి శౌర్య కూడా వస్తుంది. వచ్చిరాగానే ఏంటి ఇక్కడ ఉన్నారంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి దీపతో ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావని అడగడంతో పనుందంటూ లోపలికి వెళ్లిపోతుంది దీప. ఆ తర్వాత పిల్లలిద్దరూ ‘అమ్మకు ఏమైంది? నాన్న కూడా ఈ మధ్య ఎలానో ఉంటున్నారు. ఎప్పుడు అమ్మ గురించి అడిగిన చికాకు పడే నాన్న.. నిన్న మనం అడగ్గానే తలదించుకుని ఉన్నాడు. నాతో రండి అంటూ ఇక్కడికి తీసుకువచ్చాడు. ఏదో తప్పు చేసిన వాడిలా సైలెంట్‌గా ఉంటున్నాడు’ అని అనుకుంటారు. దీంతో రౌడీ అదేంటో నేను తెలుసుకుంటా అని హిమతో అంటుంది. 

అయితే లోపలి నుంచి వాళ్లిద్దరూ మాట్లాడుకునేదంతా దీప వింటుంది. మరోవైపు సౌందర్య దీప ఇంట్లో నిన్న ఏం జరిగి ఉంటుందా? అని ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్‌ బ్యాగ్‌ పట్టుకుని కిందకు వస్తాడు. శ్రావ్య కార్తీక్‌తో టిఫిన్‌ తీసుకురమ్మంటారా బావగారు అని అడగ్గానే.. ‘వద్దమ్మా నేను మీ అక్క ఇంట్లో.. అదే మా ఇంట్లో చేస్తాను’ అని కార్తీక్‌ అంటాడు. వెంటనే సౌందర్యతో ‘మీ అక్కా పిల్లలతో కలిసి మా ఇంట్లో భోజనం చేస్తాను.. ఆహా వినడానికి ఎంత సంస్కారవంతంగా ఉందిరా.. ఈ మాట చెప్పడానికి నీకు పదేళ్లు పట్టింది’ అని అంటుంది. దీంతో కార్తీక్‌ తలదించుకుంటూ అవును మమ్మీ పెద్ద తప్పు చేశాను.. అదే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని అనగానే వెంటనే సౌందర్య మరి ఆ తప్పుని(మోనిత ప్రెగ్నెన్సీ విషయం) అంటూ ప్రశ్నిస్తుంది. 

అలాగే సౌందర్య మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది కార్తీక్‌.. నిన్ను చూస్తే కాదు.. దీప, పిల్లలు గుర్తోస్తే అంటుంది. అంతేగాక పిల్లలు, దీపా పదేళ్లుగా పడిన కష్టాలను ఆమె కార్తీక్‌కు గుర్తు చేస్తుంది. ‘శౌర్య సొంత తండ్రిని నాన్న అని పిలవడానికి ఎంతలా ఆలోచిందిరా, ఇంత ఐశ్యర్యం ఉన్నా బస్తిల్లో లేనివాళ్లలా ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు నువ్వు మారిపోయి అంతా బాగుంటుందని సంతోషించే సమయానికి పెద్ద ప్రళయాన్ని సృష్టించావు. రేపు మోనితను కడుపుతో చూసి పిల్లలు ఆమె భర్త ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతవురా’ అని నిలదీస్తుంది సౌందర్య. దీంతో పరిస్థితి అంతవరకు రానివ్వను మమ్మీ అంటాడు కార్తీక్‌. 

వెంటనే సౌందర్య కోపంతో ‘పళ్లు రాలగోడతాను’ అని కార్తీక్‌పై అరుస్తుంది. మోనిత అంటే ఆడబొమ్మ కాదురా.. ఆడపల్లి ఆమె ఎలాంటిదైన కానీ ఒక మాగాడి వల్ల తల్లి అవ్వడం అంటే చిన్న విషయం కాదురా. మోనిత పొగరుదే కావచ్చు, పరాయి అడదాని భర్తను కోరుకున్నదే కావచ్చు. పదహారేళ్లుగా చూస్తున్నా మోనితా నిన్ను తప్పా మరే మగాడిని వేరే దృష్టితో చూడలేదు. నువ్వే ప్రాణంగా బతికింది. అందుకే అది ప్రమాదకారి అని ఎన్నోసార్లు హెచ్చరించిన వినలేదు. ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు. అందరిని పడేశావు. నువ్వు ఇప్పుడు నా భార్య, పిల్లలు అంటే ఆమె ఊరుకుంటుందా? నా పరిస్థితి ఏంటని కాలర్‌ పట్టుకుని నిలదీస్తుంది’ అంటుంది సౌందర్య

మధ్యలో మోనిత ఫోన్‌ చేయడంతో కార్తీక్‌ కట్‌ చేస్తాడు. అయినా పదే పదే ఫోన్‌ చేస్తుండటంతో కార్తీక్‌ ఫోన్‌ స్విచ్చావ్‌ చేస్తాడు. దీంతో మోనిత ‘నా ఫోన్‌ కట్‌ చేస్తాడా? ఇంతకు ముందు చేస్తున్నాడంటే ఒకే కానీ ఇప్పుడు నా గురించి తెలిసి కూడా కాల్‌ కట్‌ చేస్తున్నాడేంటి?’ అంటే కార్తీక్‌ నన్ను కట్‌ చేస్తున్నాడా? అలా జరగకూడదు’ అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తన చీర ఐరన్‌ చేయమని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప పిల్లను తీసుకుని గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కార్తీక్‌ జనతా హాస్పిటల్‌ అనే బోర్డు పెట్టి ఉచిత వైద్యం అందించబడును అనే బోర్డు పెడతాడు. అది చూసి పిల్లలు దీప షాక్‌ అవుతారు. లోపలి నుంచి కార్తీక్‌ బయటకు వస్తాడు. 

పిల్లలు ఇక ఇక్కడే ఉంటావా నాన్నా అని అడగ్గానే ‘అవునమ్మా ఇక నుంచి ఇక్కడే ఉంటాను.. ఇక్కడే వైద్యం చేస్తాను’ అంటూ దీపను చూస్తూ సమాధానం ఇస్తాడు. ఇక పేదవారికి ఉచిత వైద్యం చేస్తానంటూ దీపతో లక్ష్మణ్‌కు ట్రీట్‌మ్మెంట్‌ చేస్తానని చెప్పి రమ్మని చెప్పుమంటాడు. దీంతో హిమ అమ్మా నువ్వు ఇప్పుడు హ్యాపీనేగా అని అడుగుతుంది. దీప మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో శౌర్య నాన్న చాలా మంచివాడని తనకు చిన్పప్పుడే తెలుసని, భలబద్రాపురంలో ఉన్నప్పుడు నాన్నని క్యాంప్‌లో చూశాని అప్పటి విషయం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు నీతో పాటు మోనిత ఆంటీ కూడా వచ్చింది కదా నాన్నా అని శౌర్య అనగానే దీప రెండు కనుబొమ్మలు పైకి లేపి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

మరిన్ని వార్తలు