karthika Deepam: మోనితకు దొరికిన క్లూ, ఏంటది..

7 May, 2021 12:17 IST|Sakshi

కార్తీకదీపం మే 7: దీప విషయంలో ఆదిత్య.. కార్తీక్‌ను నిలదీయాలనుకుని పిలుస్తాడు. అదిత్య క్లాస్‌ పీకడానికే పిలిచాడని కనిపెట్టిన కార్తీక్‌ శౌర్యను  వెంట తీసుకని వెళ్తాడు. శౌర్య ఉండగా ఏం మాట్లాడలేననే అన్నయ్య కావాలని శౌర్య తీసుకువచ్చాడని అనుకుని నువ్వు చాలా తెలివైనోడివి అన్నయ్య అంటాడు. దీంతో శ్రావ్యకు ఫోన్‌ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నువ్వు వచ్చి శౌర్యను తీసుకెళ్లు అని చెబుతాడు. ఇక కార్తీక్‌ ఆదిత్యతో నువ్వు నాకంటే తెలివైనోడివారా అంటూ శౌర్యను పిలిచి శ్రావ్య పిన్ని పిలుస్తుందట వెళ్లు అని చెబుతాడు కార్తీక్‌.

ఆదిత్య కార్తీక్‌తో ‘వదినను వేరుగా చూస్తు ఎందుకు అలా అవమానిస్తున్నావు. తను ఈ ఇంటికి పెద్ద కొడలు’ అంటూ  కార్తీక్‌ని నిలదీస్తాడు. ఈ విషయంలో ‘నేను ఇలాగే ఉంట. ఇదేదో నాకు చెప్పడం కంటే మా అన్నయ్య చెప్పిట్లు వినొచ్చు కదా అని మీ వదినకే చెప్పోచ్చు కదా’ అంటూ అసహనంగా అక్కడి నుంచి కార్తీక్‌ వెళ్లిపోతాడు. దీంతో ఆదిత్య అన్నయ్య ఇలా ప్రవర్తించడానికి ఇంకేదో బలమైన కారణం ఉంది ఏంటది అని మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉండగా మోనిత దేశాన్ని జయించినంత ఆనందంలో ఉంటుంది.. పుస్తకాలన్ని ఎదురుగా వేసుకుని ఏదో వెతుకుతూ ‘హా దొరికింది. కార్తీక్ నువ్వు ఇక ఎక్కడికీ పోలేవు.. నా పట్ల అటెన్షన్ ప్లే చేసే టైం వచ్చింది. కార్తీక్‌ను నేను సాధించా అని తెగ పొంగిపోతుంటుంది’

మరుసటి రోజు ఉదయం కార్తీక్‌ రేడి అయ్యి కిందకు వస్తాడు. హాల్‌లో సౌందర్య పేపర్‌ చదువుతూ ఉంటుంది. మరోవైపు వంటగదిలోనే ఉన్న దీప.. కార్తీక్, సౌందర్య‌లను గమనిస్తూ ఉంటుంది. ఆమె ఆ సామ్రాజ్యాన్ని (వంటగది) ఏలుతూనే ఉంటుందా? అని కార్తీక్ సౌందర్య‌తో అనడంతో.. నేను మీ ఇద్దరి మధ్య ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుస్తుందా కార్తీక్ అని అంటుంది. కార్తీక్ ఏదో చెప్పబోతుండగా.. దీపని చూసి ఆగిపోతారు. ఇంతలో దీప వచ్చి కాఫీ అందిస్తుంది.. అయిష్టంగా కాఫీ తీసుకుంటారు కార్తీక్. ఆ తర్వాత మీకు ఉల్లిపెసరట్టు చేస్తా.. ఉప్మా చేస్తా.. మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికి రావాలి.. లేదంటే నేను బాక్స్ తీసుకుని వంటలక్కలో హాస్పటల్‌కి వచ్చేస్తా.. అని అనడంతో కార్తీక్ కోపంతో ఊగిపోతాడు. 

ఇంట్లో ఏమైనా ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారా నేను చెప్పింది చేయరు.. వద్దన్నదే చేయాలని డిసైడ్ అయ్యారా అని కార్తీక్ ఫైర్ అవుతాడు. ఇక సౌందర్య కూడా ఎందుకు దీప ఇలా చేస్తున్నావని, వాడు ఒకటి అంటాడు.. నువ్వు ఇంకోటి అర్థం చేసుకుంటావ్.. వాడు వద్దన్న పనిని పంతంతో ఎందుకు చేస్తున్నావు,  సర్ధుకుపోతే సరిపోయేదానికి ఇంత మొండిగా చేయడం దేనికి అని దీపతో అంటుంది సౌందర్య. దీంతో దీప.. అనారోగ్యం అనే వంకతో నన్ను అన్ని పనులకు దూరంగా పెట్టి.. ఒక వస్తువుగా చూస్తుంటే సర్దుకుని పోవాలా. ఇంట్లో ఈ ఖరీదైన వస్తువుల్లో ఏ వస్తువుగా ఉండను అత్తయ్య అంటూ అసహనాకి లోనవుతుంది.

మీ కొడుక్కి భార్యగా వద్దుకానీ.. ఈ ఇంటికి ఓ దిక్కుమాలిన కోడలు కావాలని తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశారని వాదిస్తుంది. దీంతో సౌందర్య వాడు అనడం కాదే..  నేనే అంటున్నా నువ్వు మనుషుల్ని అంచనా వేయడంలో పూర్తి ఫెయిల్ అవుతున్నావు.. అందర్నీ శత్రువుల్లాగే చూస్తున్నావు. ఇది నీకు కరెక్ట్ కాదు.. కొద్దిరోజులు ఓపిక పట్టు అని వేడుకుంటుంది. నా ఓపిక మొత్తం ఖర్చయిపోయింది అత్తయ్యా.. అందుకే ఈ రోజు మాట్లాడుతున్నా అని దీప అనడంతో మూర్ఖులతో మనం వాదించలేం మమ్మీ వదిలెయ్ అని అంటాడు కార్తీక్. అవును మూర్ఖురాలినే నన్ను మీరు ఆ రోజు దిగజారిపోయిన నెరజాన అన్నా కూడా నా భర్త నా కోసం వచ్చాడని మనసు మార్చుకుని మీతో వచ్చేశాను అందుకు నేను మూర్ఖురాలినే అంటూ దీప కడిగిపారేస్తుంది.

అది కాదు దీపా.. ఒక్కసారి అపార్థాల తెరలు తొలగించి చూడు.. నిస్వార్థంగా నీ కోసం ఆలోచించే వాళ్లు కనిపిస్తారు.. మీ అత్తింటిలో ఉన్నవాళ్లంతా నీ ఆత్మీయులే అని నీ మనసు గుర్తిస్తుందే అని సౌందర్య దీపని బతిమిలాడుతుంది. అయినా సరే దీప మాత్రం తన మొండి వాదనను కంటిన్యూ చేస్తుంది.చివరికి కార్తీక్ కలగజేసుకుని.. ఇప్పటికే ఇది చాలా మాట్లాడేసింది మమ్మీ.. భరిస్తే ఇది మనల్ని బద్దశత్రువుల్లాగే చూస్తుంది. ఆమె ఏం కోరుకుంటుందో.. ఏమి ఆశిస్తుందో.. పిల్లల కోసం నేను ఇవన్నీ భరిస్తున్నా.. నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడితే మాత్రం అంటూ దీపకి వేలు చూపిస్తూ హెచ్చరిస్తాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరిగింది, దీప ఎలాంటి నిర్ణయం తీసుకొనుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. 

మరిన్ని వార్తలు