Karthika Deepam: ఇదేమైన మోనిత డ్రామా? అని అనుమానిస్తున్న దీప

23 Jun, 2021 17:32 IST|Sakshi

కార్తీకదీపం జూన్‌23వ ఎపిసోడ్‌: మోనితకు గట్టిగా బుద్ది చెప్పాలని సౌందర్యకు సలహా ఇవ్వడానికి వెళ్లిన భాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఇంటివ దగ్గర మురళీ కృష్ణ ఎదురు చూస్తుంటాడు. ఇంతలో భాగ్యం వస్తుంది. రాగానే చెప్పావా అంటూ ఆత్రుతగా అడుగుతాడు మురళీ కృష్ణ. దీంతో భాగ్యం అక్కడ జరిగిన విషయం, సౌందర్య ఏం చెప్పిందో అన్ని వివరిస్తుంది. ఇదిలా ఉండగా కార్తీక్‌ ఫుల్‌గా తాగి ఆ రోజు మోనిత ఇంట్లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ మోనిత గీసిన గీతలు చూస్తూ మనసులో తప్పు చేసిన భావనతో పశ్చాతాప పడతాడు.

మరోవైపు దీప పిల్లలు పడుకుని ఉండగా వారిని చూస్తూ హిమా ఆటోలో తనతో బాధపడిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది.హిమ అడిగిన ఏ ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదని ఆలోచిస్తుంది. చిన్నప్పుడు సవతి తల్లి కారణంగా లేకుండా ఎందుకు కొడుతుందని నాన్న అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు, నా మీద డాక్టర్‌ బాబుకు అనుమానం ఎందుకంటే సమాధానం లేదు, ఇప్పుడు నాన్న ఎందుకు అలా ఉంటున్నాడంటే నా దగ్గర సమాధానం లేదంటూ మనసులో అనుకుంటు కుమిలి పోతుంది. నా కడుపున పట్టినందుకే మీకు ఇన్ని కష్టాలంటూ దీప మదనపడుతుండగా బయట నుంచి శబ్థం వినిపిస్తుంది.

దీంతో దీప వెళ్లి చూడగా కార్తీక్‌ తను ఏ తప్పు చేయలేదని నన్ను నమ్ము దీప అంటూ బాధపడుతుంటాడు. ‘నాతో మాట్లాడూ దీప, వాదించు.. తిట్టూ.. నేను చెప్పేది విను దీప’ అంటూ తల పట్టుకుని ఏడుస్తుంటాడు కార్తీక్‌. దీంతో దీప మనసులో తను ఏం చేసిన కరెక్ట్‌ అని వాదించి మనిషి ఎందుకు ఇలా ఉంటున్నాడు. తప్పు చేశాననే భావన ఆయనలో కనిపిస్తుంది. ఎలాగు మోనితను పెళ్లి చేసుకుంటా అనుకున్నాను కదా అందుకే ఇద్దరం కలిసిపోయామని ఆయన చెప్పోచ్చు.. కానీ అలా కాకుండా తప్పు చేసిన వాడిలా అసలు నోరు కూడా మెదపడం లేదంటూ దీప కార్తీక్‌ను చూస్తూ మనసులోనే మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్‌ కింద కూర్చోని బాధపడుతుంటే దీప వెళ్లి మంచినీళ్లు ఇస్తుంది. 

గ్లాస్‌ తీసుకుని నీళ్లు తాగిన అనంతరం కార్తీక్‌ తనతో మాట్లాడమని, తాను ఏ తప్పు చేయలేదంటూ దీపతో అంటాడు. ‘దేవుడు నాకు పిల్లలు పుట్టే యోగం ఉందని మరో రకంగా అయినా తెలియజేయోచ్చు కదా. ఎవరైతే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారో నా క్లోజ్‌ ఫ్రేండ్‌కే అలా జరగడం ఏంటి’ అంటూ కుంగిపోతాడు. అంతేగాక ఆ రోజు ఫుల్‌గా తాగి ఉన్నానని అసలు ఏం జరిగిందో తనకు తెలియదంటాడు. అంతేగాక మ మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేవరకు తనకు తెలియదని కార్తీక్‌ చెప్పగానే దీప ఆలోచనలో పడుతుంది.

ఇదిలా ఉండగా ఆదిత్య సౌందర్యతో హిమా, శౌర్యలను చూసోస్తానని సౌందర్యతో అనగానే ఆమె వద్దని చెబుతుంది. కార్తీక్‌ కూడా అక్కడే ఉన్నాడని అన్నయ్యను చూడగానే నీ మాటలు అదుపులో ఉండవని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావని చెబుతుంది సౌందర్య. ఇక దీప కార్తీక్‌ తనతో చెప్పిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇదంతా నిజమేనా లేక మోనిత ఏదైనా డ్రామా ఆడుతుందా? అనుకుంటుంది. డాక్టర్‌ బాబులో మోనితపై అభిమానం కనిపించడం లేదని ఆమె చేతిలో మోసపోయిన వ్యక్తిలా చూస్తున్నాడనుకుంటుంది. దీని వెనక ఎదో రహస్యం ఉందని కనిపెట్టాలని దీప నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు