25వ తేదీన ఏం చేయబోతుందో సౌందర్యకు వివరించిన మోనిత

25 Jun, 2021 17:12 IST|Sakshi

కార్తీకదీపం జూన్‌ 25 ఎపీసోడ్‌: కార్తీక్‌, దీపలు కూర్చుని మాట్లాడుకునే సీన్‌తో నిన్నటి ఎపిసోడ్‌ ముగిసన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌ అదే సీన్‌తో ప్రారంభమవుతుంది. దీప మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నేను చేయని తప్పుకు ఎన్నో అనరాని మాటలు పడ్డాను. ఇప్పుడు అలాంటి మాటలు మిమ్మల్ని అనలేను. అలాగే ఇంకేవరు అన్న వినలేను. మీకు నాకు అదే తేడా. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంట దీప ఎందుకు స్పందించడం లేదో’ అని అంటుంది. ఆ తర్వాత మీ భార్యగా మీకు ఏ విధంగా సాయపడగలను? నాకు నేను సర్దిచెప్పుకోవాలా? లేక నా తలరాత ఇంతేనని రాజీ పడాలా? అని కార్తీక్‌ని ప్రశ్నస్తుంది. 

దీంతో కార్తీక్‌ నువ్వు నువ్వుగానే ఉండని, తనని నమ్ము అంటాడు. నా మీద కోపంగా ఉంటే తిట్టు.. ఇంకా కసి తీరకపోతే చెంప పగలగొట్టు దీప అంటుండగా దీప అలా మాట్లాడకు అన్నట్లుగా రియాక్ట్‌ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్‌ ‘నేను తప్పు చేయలేదు అనట్లేదు.. కానీ ఆ తప్పు నా ప్రమేయం లేకుండా జరిగిందని నమ్ము. ఇదంతా నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పడంలేదు దీప’ అంటాడు. దీంతో ఇప్పడే నా ప్రమేయం లేకుండ జరిగిందని చెబుతూనే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదంటున్నారే అని ప్రశ్నించింది. ‘అవును మళ్లీ మళ్లీ అదే చెబుతాను ఎందుకంటే అదే నిజం కాబట్టి. కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండోద్దని వేడుకుంటాడు  కార్తీక్‌. 

మరోవైపు మోనిత సౌందర్య ఇంటికి వెళ్లి తనకు న్యాయం చేమని అడగ్గా ‘నా కొడుకు నాకో విషయం చెప్పాడు’ అని చెప్పి మోనితలో కంగారు పుట్టిస్తుంది సౌందర్య. ఇక శ్రావ్యను పిలిచి మోనితకు జ్యూస్‌ తెప్పిస్తుంది. అది తాగిన మోనిత టెన్షన్‌గా ఇప్పటికైనా చెప్పండి ఆంటీ.. కార్తీక్ మీతో ఏం చెప్పాడని నిళ్లు నములుతూ అడుగుతుది. వెంటనే సౌందర్య నీకు తెలిసి తెలియనట్లు నటించడకు మోనితా.. వాడు చెప్పింది నిజమని నా మనసు చెబుతోంది అంటూ కార్తీక్‌ సౌందర్యతో ‘నేనుఆ తప్పు చేశానంటే నమ్మలేకపోతున్న మమ్మీ. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు’ అని అన్నాడని అంటుంది. 

ఆ తర్వాత మోనితతో.. ఇంకా వివరంగా ఇంకా లోతుగా దీనిపై చర్చించగలను కాకపోతే నువ్వే ఒక గైనకాలజిస్ట్‌వి కాబట్టి అంత వివరంగా చెప్పాల్సిన పనిలేదు.. అయినా ఇప్పుడు నువ్వు కన్నెపిల్లవి కాదంటే.. దానికి కారణం మా వాడికి తెలియదు అంటే.. అయినా సరే వాడేనని నువ్వు అంటే.. మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందని అని సౌందర్య అనడంతో మోనిత అయోమయంగా చూస్తుంది. అంతేగాక ఈ తప్పు గురించి తప్పుడు సమాచారం క్రియేట్ చేశావా? అని, తప్పటడుగు వెనుక తప్పని సరైన కారణం కనిపెట్టావా? అని నిలదీస్తుంది.  

అలాగే పూజ రోజు నువ్వు దీప ముందే ఈ విషయం బయటపెట్టగానే.. వాడు తలదించుకోలేదు సరికదా.. నీకే చివాట్లు పెట్టాడు.. ఆ నిజాయితీ వాడి కళ్లల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాను అని సౌందర్య ప్రశ్నలతో కడిగిపారేసే సరికి మోనిత షాక్‌ అవుతుంది. అయితే మోనిత కాసేపటికి తేలుకుని ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో మీకు తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయినా క్రియేట్ చెయ్యడానికి నేనేం పురాణకాలనాటి స్త్రీని కాదు..ఇది నిజం.. దీన్ని నిరూపించుకోవడానికి ఏ వేదిక కావాలంటే ఆ వేదికను ఆశ్రయించొచ్చు అని సవాలు చేస్తుంది. 

దీప విషయంలో మీ కొడుకుని నమ్మని మీరు నా విషయంలో మీ కొడుకునే నమ్ముతున్నారా? ఇంతకాలం మీరు చాలా ఫర్ఫెక్ట్ అనుకున్నాను.. నాకు సపోర్ట్ చేసి మొదటి వ్యక్తి మీరే అవుతారు అనుకున్నాను.. కానీ మీరు సగటు తల్లిగా మారిపోయారు.. మీ కొడుకుతో కలిసి నాకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక నా జీవితం గురించి ఎవరితోనూ సలహాలు తీసుకోదలుచుకోలేదు. నిజం నా కడుపులో ఉంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తున్నాను.. ఈ నెల 25 తారీఖున కార్తీక్‌తో నా పెళ్లికి స్లాట్ రిజిస్టర్ చేసుకోబోతున్నాననంటూ సౌందర్యకు షాక్‌ ఇస్తుంది. 

అయితే ఏ ఊరికో వెళ్లి తల దాచుకోమనే చవకబారు సలహాలు ఇవ్వద్దని మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను.. అదే జరిగితే.. పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి.. గుర్తుపెట్టుకోండి ఆంటీ అంటూ హెచ్చరిస్తుంది. అలాగే 25 తేదీన మీ కొడుక్కి నాకు పెళ్లి.. నన్ను ఆశీర్వదించండి అత్తయ్యగారు అంటూ సౌందర్య కాళ్ల​కు దండం పెట్టుకుంటూ ఆశీర్వదించమని మోనిత అంటుండగా సరిగ్గా అప్పుడే హిమ, శౌర్యలు ఎంట్రీ ఇస్తారు. ఆ సీన్‌ చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే మోనిత ఆంటీ ఎందుకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందని అడడంతో సౌందర్య పిల్లలు ఏం వినలేదని ఊపిరి పీల్చుకుంటుంది. 

మరిన్ని వార్తలు