బుల్లి కార్తీక్‌ పుడతాడంటూ.. కార్తీక్‌కు మోనితా వీడియో మెసెజ్‌

9 Jun, 2021 14:40 IST|Sakshi

కార్తీకదీపం జూన్‌ 9: దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయి శ్రీరాంనగర్‌ బస్తీకి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి దీప ఇంట్లో లేదని తెలుసుకున్న సౌందర్య, ఆదిత్యలతో మీరు ఆపలేదా? అని అడగ్గా ఏందుకు ఉండాలి ఇక్కడ? అని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీంతో అసలేం జరిగిందో కార్తీక్‌ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సౌందర్య వినిపించుకోకుండా... ఇది నాకు కాదు నీ భార్యకు, నీ వల్ల గర్భవతి అయిన ఆ మోనితకు అంటుంది. ఇక కార్తీక్‌ దీపను తీసుకురావడానికి శ్రీరాంనగర్‌ బస్తీకి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(మంగళవారం) ఎపిసోడ్‌ ఇక్కడ చదవండి..

దీప శ్రీరామ్ నగర్ బస్తీలో ఇంటి ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటే వారణాసి ఇళ్లంతా కడుగుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వారణాసితో మీ అక్క నాతో ఇంటికి వస్తుందని చెబుతాడు. దీంతో దీప వెంటనే వద్దులే డాక్టర్ బాబు ఎవరు ఎక్కడుండాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు.. మీరు నేను కాదు అంటుంది. కార్తీక్‌ ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. దీప మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ‘అసలు నీ మనసులో ఏం ఉంది దీపా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అంటు వివరిస్తుంటాడు. కానీ దీప వినదు. కుర్చీ వెయ్యనా.. భోజనం చేశారా? అంటూ పొంతన లేని సమాధానాలిస్తూ, ఆ విషయం అనవసరం అన్నట్టు ప్రవర్తిస్తుంది.

అయినా కార్తీక్‌ చెప్పే ప్రయత్నం చేస్తుంటే వారణాసిని అడ్డు పెట్టుకుని ‘ఇక చాలు వారణాసీ.. ఎంతసేపు కడుగుతావు.. వదిలెయ్’ అంటు కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. దీంతో కార్తీక్‌ తనని అర్థం చేసుకునే అవకాశమే లేదని అర్థమైందని తలదించుకుంటాడు. ‘నన్ను క్షమించే ప్రసక్తే లేదని క్లియర్‌గా తెలుస్తోంది.. నీకంటే నేనే దురదృష్టవంతుడ్ని దీపా.. నీకంటే ఎక్కువగా నేనే నష్టపోయాను’ అంటు పశ్చాత్తాపపడతాడు కార్తీక్‌. అయినా దీప తన తీరు మార్చుకోకుండా ‘మంచి నీళ్లు కూడా తేవాలి వారణాసీ’ అంటుంది. సీన్ వారణాసికి కూడా అర్థమై బాధగా, మౌనంగా చూస్తాడు. ఇక కార్తీక్‌ వెళ్లొస్తాను అని ముందుకు కదలడంతో భోజనం చెయ్యరా? అని అడుగుతుంది దీప.

నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కార్తీక్‌ అనగా.. ‘ఈ ఇంట్లో అయినా..ఆ ఇంట్లో అయినా.. మరింకెక్కడైనా భోజనం మాత్రం మానకండి’ అని దీప సమాధానమిస్తుంది. కార్తీక్‌ తప్పు చేశాడని తాను కూడా నమ్మతున్నట్లు చెప్పకనే చెబుతుంది దీప. మురళీ కృష్ణ దీప గురించి బాధపడుతుంటే.. భాగ్యం వచ్చి దీప జీవితం నిలబడే మార్గం ఒకటుందయ్యా అంటూ.. ‘అల్లుడు తప్పు చేశాడని దీప తనతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు.. ఆ మాటకొస్తే నీ మొదటి పెళ్లాం చచ్చిపోతే నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదా? నేను నీతో కాపురం చెయ్యట్లేదా? ఇదీ అంతేనయ్యా.. కాకపోతే దీప ఉండగానే మోనితకి కడుపు చేశాడు.. ఇప్పుడు గొడవలకు పోయి జీవితం నాశనం చేసుకోవడం కంటే.. రాజీ పడి కలిపోవడం మేలు.. లేదంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. కొంచెం ఆలోచించయ్యా’ అని సలహా ఇస్తుంది భాగ్యం. అది విని మురళీ కృష్ణ నిజమే అంటూ ఆలోచనలో పడతాడు. 

కార్తీక్ తన రూమ్‌లో జరిగిందంతా తలుచుకుని కుమిలిపోతూ..  ఆ రోజు రాత్రి మోనిత ఇంట్లో డ్రింక్ చేసిన సీన్ గుర్తు చేసుకుని.. అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటాడు. ‘బుద్ది లేదా రా నీకు.. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక ఆడపిల్ల ఇంట్లో డ్రింక్ చెయ్యడమేంట్రా.. ముందు కొడితే.. సంస్కారం ఏం అయిపోయింది.. మమ్మీ ఎప్పుడూ అంటుంది నువ్వు స్టుపిడ్ అని.. నిజంగానే నేను స్టుపిడ్‌ని..’అని తిట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే మోనిత ఓ వీడియో మెసెజ్ పంపిస్తుంది. ఇంతలో మోనిత కార్తీక్‌కు వీడియో మెసేజ్‌ పంపిస్తుంది. ‘హాయ్ కార్తీక్.. ఎలా ఉన్నావ్.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడా? మగా? అని డౌట్ వచ్చింది. నేను గైనకాలజిస్ట్ కాబట్టి స్కాన్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అది నేరం.. అయినా డెలివరీ అయ్యేదాకా ఆగితేనే థ్రిల్ అంటుంది. 

ఇంతకీ నీకు ఎవరు కావాలి పాపా? బాబా? పాప వద్దులే.. ఆల్ రెడీ మనకు ఇద్దరున్నారు కదా.. మనకు బాబే కావాలి. దేవుడ్ని నేను అదే కోరుకుంటాను.. బుల్లి కార్తీక్‌ని ఇవ్వమని.. ఐ లవ్ దట్ ఫీలింగ్ బై' అంటుంది వీడియోలో. అది చూసి కార్తీక్ తలపట్టుకుని మరింత కుంగిపోతాడు. మోనిత మాత్రం సంబరపడిపోతూ ‘ఇదేంటి కార్తీక్ నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు..నన్ను దూరం పెడుతుతున్నాడా? అంటే కార్తీక్ కూడా కొంత మంది మగాళ్లలా అవసరం తీరాక వదిలెయ్యాలనుకుంటున్నాడా? అని ఓ సెకన్‌ కంగారుపడుతుంది. కానీ అంతలోనే  నా కార్తీక్ అలా చేయడు. ఏదో కంగారులో ఉండి సమాధానం ఇవ్వలేదనుకుంటా’ అంటూ సరిపెట్టుకుంటుంది మోనిత.

మరిన్ని వార్తలు