Karthika Deepam: హిమ దూరంగా వెళ్లిపోతావా అనగానే ఉలిక్కి పడ్డ దీప

15 May, 2021 12:40 IST|Sakshi

కార్తీకదీపం 1040వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం మే 15: దీప పడుకొకుండా ఆలోచిస్తుంటే.. అమ్మా! నాన్న మమ్మల్ని పంపించమంటే పంపిస్తావా అని హిమ అడుగుతుంది. దీంతో దీప, లేదు అన్నట్లు తల ఊపుతుంది. మరెందుకమ్మ మమ్మల్ని అక్కడే వదిలేసి వచ్చావు, విజయనగరం వెళ్లినట్టు ఈసారి అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతావా అని హిమ అనగానే దీప ఉలిక్కిపడుతుంది. దూరంగా.. ఎక్కడికో వెళ్లిపోతానంటుంది.. మీ అందరిని వదిలేసి దూరంగా ఎప్పటికీ తిరిగి రాని చోటుకు అంటూ దీప మనసులోనే ఆవేదన చెందుతుంది. ఇక కార్తీక్‌తో మాట్లాడి సౌర్య బెడ్‌రూంకి వస్తుంది.

ఏంటి ఇంకా పడుకోలేదా అని అడుగుతుండగా.. హిమ నిద్ర పట్టకుంటే సౌర్యకు కథ చెప్పేదానివట కదామ్మా, ఈ రోజు ఎందుకో నిద్ర రావడం లేదు కథ చెప్పమని అడుగుతుంది. దీంతో సౌర్య, హిమలు కలిసి దీపను కథ చెప్పమని మారాం చేస్తారు. దీప ఆవు-దూడ కథ పేరుతో తనను ఉద్దేశిస్తూ చెబుతుంది. ఓ ఆవు అడవి గుండా వెళుతుంటే దానికి పెద్దపులి ఎదురవుతుంది. దీంతో ఆవు భయపడుతుందని, అది చచ్చిపోతానని కాదు, తల్లి లేకపోతే దూడ తల్లిలేనిది అవుతుదని చెబుతుంది. దీంతో ఆవు పెద్దపులితో ‘నేను నీకు ఆహారం కావడం కోసమే పుట్టానని నాకు ఇప్పుడే అర్థమైంది. అలాగే అవుతాను కానీ నా ఆఖరి కోరిక ఉంది తీరుస్తావా అని అడగడంతో పులి సరేనంటుందని చెబుతుంటే హాల్‌ నుంచి కార్తీక్‌ కథ వింటు ధీనంగా చూస్తుంటాడు.

ఇక దీప ‘ఆవు పులితో.. నాకో బిడ్డ ఉంది. తోటి దూడలతో ఆడుకుంటూ ఈ అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుంటుంది. పసిబిడ్డ ఆకలితో ఉంటుంది. నేను వెళ్లి దాని కడుపునిండా పాలిచ్చి. తోటి దూడలతో ఎలా మెలగాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పి వస్తానంటూ పులిని ఆవు వెడుకుంటుంది. అది విని కరిగిపోయిన పులి మళ్లీ రావాలని చెప్పి పంపిస్తుంది. ఆవు దూడ దగ్గరకు వెళ్లింది. ఆఖరిసారి కదా తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. కడుపు నిండా పాలిచ్చింది.. జాగ్రత్తలు చెప్పింది. మందతో వెళ్లినప్పుడు విడిగా వెళ్లొద్దు అని చెప్పింది. అందరితోనూ ప్రేమగా ఉండాలని చెప్పింది. అమ్మ లేదని దిగులు పడొద్దు, నేను ఇంకెప్పటికీ తిరిగి రానంటూ ఆవు, దూడకు చెప్పి వెళ్లిపోతుంది’ అని చెబుతూ దీప కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఆవు తిరిగి రావడంతో పులి దాని నిజాయితికి మెచ్చుకుని వదిలేస్తుందని చెబుతంది దీప. అలాగే ఈ కాలంలో అలా వదిలేస్తుందా’ అని దీప అన్న మాటలు కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంటాయి. 

దీప మనసులో పులిలా పొంచి ఉన్న మృత్యువు.. ఈ అమ్మని జాలి తలిచి వదిలేయకపోతే.. మీరేమైపోతారు అమ్మా అంటు సౌర్య, హిమలను హత్తుకుంటుంది. ఇక మొరళి కృష్ణ కూతురు కనిపించడంలేదనే బాధలో మద్యం తాగుతుంటాడు. దీంతో భాగ్యం వచ్చి ఈ సారి దీప కనిపిస్తే పిల్లలను, దాన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం అంటూ మురళీ కృష్ణకు ధైర్యం చెబుతుంది. మరోవైపు దీప మెట్ల దగ్గర కూర్చోని తాను చిన్నతనంలో సవతి తల్లితో పడిన బాధలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటే కార్తీక్‌ పక్కనే కూర్చుని ఊరుకో అంటూ ఓదారుస్తాడు. దీంతో దీప ‘ఎందుకో ఈ గమ్యం లేని ప్రయాణం.. ఎందుకో.. ఈ పుట్టుక చావు’ అంటూ వైరాగ్యంతో మాట్లాడుతుంటే కార్తీక్ దీపనే జాలిగా చూస్తుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్‌లో చుద్దాం.

చదవండి: 
karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప
డాక్టర్‌ బాబుకు హీరో చాన్స్‌ అలా మిస్సయిందట..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు