Karthika Deepam: దీప పదేళ్ల కోరిక తీర్చిన డాక్టర్‌​ బాబు

18 May, 2021 14:47 IST|Sakshi

కార్తీకదీపం మే 18: దీప శ్రీరాంనగర్‌ బస్తీలో కార్తీక్‌తో కలిసి ఉందని తెలిసి మొరళీ కృష్ణ సంతోష్తిస్తాడు. దీప ఎక్కడికి వెళ్లలేదు, ఈ ఊర్లోనే.. అదే ఇంట్లో ఉందంటూ  భాగ్యంతో చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తాడు. దీంతో భాగ్యం దానికి ఇంత ఆత్మగౌరం ఎందుకండి, డాక్టర్‌ బాబే కదా ఇంటికి తీసుకు వచ్చింది హాయిగా అత్తింట్లో ఉండకుండా దానికి ఇదేం పిచ్చి అంటుంది. దీంతో మొరళీ కృష్ణ.. డాక్టర్‌ బాబులో ఇంకా అనుమానం అలాగే ఉందని, తల్లికి కోడలిగా, పిల్లలకు తల్లి అవరమని ఇంకా దాని ఆరోగ్యం గురించి ఆలోచించి తీసుకువచ్చాడని, అత్తింట్లోనే ఓ అతిథిగా ఉండటమంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది భాగ్యం అని మురళీ కృష్ణ అంటాడు.

అవునండి మీరు చెప్పింది కూడా నిజమే.. కానీ దీప ఎప్పుడు ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే డాక్టర్‌ బాబు కూడా ఎన్నాళ్లని ఓపిక పడతాడని, ఇలా చేస్తే విసుగొచ్చి ఆ మోనిత దగ్గరికి వెళ్లిపోతే, ఆమెనే పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అంటుంది. దీంతో మురళీ కృష్ణ కూడా నిజమేనంటు ఆలోచిస్తాడు. అంతేగాక దీప, కార్తీక్‌లు ఎప్పుడెప్పుడు విడిపోతారాని ఎదురు చూస్తుంది ఆ మోనిత అంటు గుర్తు చేస్తాడు. అందుకే ఈసారి వెళ్లినప్పడు దీపతో అత్తింట్లో సర్ధుకునిపోవాలని కాస్తా గట్టిగా చెప్పండని అంటుంది భాగ్యం. ఇదిలా ఉండగా కార్తీక్‌ దీప గురించి ఆలోచిస్తుంటాడు. దీప తప్పు చేసిందో లేదో పక్కన పెడితే మనిషిగా తనను హ్యాపీగా చూసుకోవాలని, దీప రక్షించుకోవాలని అనుకుంటాడు. అందుకు దీపను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు.

ఇక తెల్లారినా దీప లేవకపోవడంతో పిల్లలు (శౌర్య, హిమ) రెడీ అయ్యి కార్తీక్‌ కోసం టిఫిన్‌ తయారు చేయడానికి వంటగదిలోకి వెలతారు. శౌర్య దోశ వేస్తుంటే హిమ పక్కనే ఉండి చూస్తుంటుంది. అంతేగాక ఇంకా చట్నీ కూడా చేయాలి ఏం చేద్దామని అడుగుతుంది శౌర్యను. ఇదిలా ఉండగ పెనం మీద వేసిన దోవ దానికి అతుక్కుపోయి మాడిపోతుంది. శౌర్య దాన్ని తీసేందుకు కాస్త బలం ఉపయోగించడంతో దోశ ఎగిరి నెలపై పడుతుంది. దీంతో పిల్లలు అయ్యో అని అరవగానే కార్తీక్‌ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వంటగదిలో శౌర్య, హిమలను చూసి ఏమైంది అలా అరిచారని అడగడంతో అమ్మ ఇంకా లేవలేదని, మీకు పొద్దున్నే టిఫిన్‌ చేసే అలవాటు కదా మీ కోసం దోశ చేసిపెడదామని వచ్చామని చెప్పగానే కార్తీక్‌ ఎమోషనల్‌ అవుతాడు. నా పిల్లలు నాకోసం టిఫిన్‌ చేస్తారా, ఏం అక్కర్లేదు మీ చిట్టి చేతులకు గాయాలైతే ఈ నాన్న తట్టుకుంటాడా అంటాడు. 

మీరు వెళ్లండి ఈ రోజు నేను టిఫిన్‌ చేస్తా అనగానే.. పిల్లలు సరే నాన్న నువ్వు దోశలు వేయి మేం చట్నీకి అవసరమైనవి రెడీ చేస్తామంటారు. ఇక కార్తీక్‌ దోశలు వేసి దీప కోసం కాఫీ తీసుకుని వెళతాడు. దీపను లేపి కాఫీ చేతికిస్తాడు. లేచారా డాక్టర్‌ బాబు రాత్రి దోశల పిండి రుబ్బి పెట్టాను టీఫిన్‌ వేస్తా అనేలోపు.. కార్తీక్‌ నేనే దోశలు వేశాను. అందరి కోసం వేశాను, దోశలు వేసి హాట్‌ బాక్స్‌లో పెట్టాను, నువ్వు స్నానం చేసి టిఫిన్‌ చేశాక టాబ్లెట్స్‌ ఇస్తా అంటాడు. ఇక అక్కడ నుంచి బయటకు వస్తుంటే దీప డాక్టర్‌ బాబు అని పిలిచి కూర్చోమంటుంది. నాకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉందని,  ఒకే గ్లాస్‌లో మీతో కాఫీ పంచుకోవాలని పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. పెళ్లైన కొత్తలో మీకు చెబుదామంటే భయం, ఇక దూరమయ్యాక అడిగే అవకాశం రాలేదు. ఇప్పుడు ఎలాగు వెళ్లిపోతున్నాను కదా అందుకే అడుగుతున్న అని కార్తీక్‌తో అంటుంది దీప. వెంటనే దీప చేతిలోని కాఫీ గ్లాస్‌ తీసుకుని కొంచం తాగి దీపకు ఇస్తాడు కార్తీక్‌. అది తాగి దీప మురిసిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

మరిన్ని వార్తలు