karthika Deepam: క్షీణించిన దీప ఆరోగ్యం, పశ్చాతాప పడుతున్న కార్తీక్‌

21 May, 2021 15:14 IST|Sakshi

కార్తీకదీపం మే 21: సౌందర్య దీపని ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. మీ ఇద్దరు ఒకరినినొకరు సరిగ అర్థం చేసుకోవడం లేదని, మిమ్మల్ని అలా వదిలేస్తే మీరే తేల్చుకుంటారనుకొని నేను, మీ మామయ్య ఇంటినుంచి వెళ్లిపోయాం, చివరకు ఇదా నువ్వు తేల్చుకుంది. ఏంటే నా కొడుకు నీకు అవసరం లేదని ఇక్కడకు వచ్చావా అంటు సౌందర్య దీప మీద చిటపటలాడుతుంది. దీంతో దీప ఏ స్త్రీ భర్తను చివరి వరకు వద్దనుకొదు అత్తయ్య అంటుంది. మరేంటి ఇది.. నువ్వు ఇక్కడకు ఎవరు అవసరం లేదని వచ్చావా అనగానే, దీప దీనంగా సౌందర్య వైపు తిరగి ఏడుస్తూ ఆమో కాళ్లపై పడుతుంది. మీ లాంటి పుణ్య స్త్రీలు మనసారా దీవిస్తే అది జరుగుతుంది అత్తయ్యా, నేను నిండు నూరేళ్లు జీవించాలని మనసారా దీవించండి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప.

అది తెలిసి సౌందర్య ఒక్కసారిగా షాక్‌ అవుతుంది. సోఫాలో కూర్చుని గతంలో కార్తీక్‌తో దీపకు నిజం చెప్పు అంటూ తను చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత వాడు నాతో చెప్పనని చెప్పి, నీతో చెప్పాడా అంటుంది. అంటే మీకు కూడా తెలుసా అని దీప అనగానే తెలుసు అంటూ వణుకుతున్న గొంతుతో సమాధానం ఇస్తుంది.  నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమమైపోతారు అత్తయ్య అంటు దీప సౌందర్య ఒళ్లో తల పెట్టి ఏడుస్తుంది. దీంతో వాడు(కార్తీక్‌) నిన్ను పెళ్లి చేసుకుని డాక్టర్‌ బాబు కాలేదే, నిన్ను కాపాడుకోవడానికే వాడు డాక్టర్‌ అయ్యాడు, నిన్ను ఎలాగైనా బతికించుకుంటాడు అంటు దీపను ఒదారుస్తుంది. లేదు అత్తయ్యా.. ఆయన నాకు వైద్యం చేయిస్తారు.. అది నిజమే కానీ నేను బతకాలి కదా? ఒకవేళ నా పవిత్రత రుజువు చేసుకోకుండానే చచ్చిపోతానా అత్తయ్య అంటూ దీప కుమిలిపోతుంది.

మరోవైపు మోనిత ‘ప్రియమణి అన్నట్లుగా కార్తీక్‌ దీపని పసిపాపలా చూసుకుంటున్నాడా? నన్ను అవైడ్ చేస్తున్నాడా?.. అంటే దీపకి విహారీకి సంబంధం అంటగట్టి నేను విజయం సాధించాననుకుంటే.. ఇప్పుడు ఆ సంగతే మరిచిపోయి. దీప చచ్చిపోతుందని తెలియగానే.. చేరదీసి సేవ చేస్తున్నాడా? ఇదంతా చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను కార్తీక్.. నా కళ్లల్లో నిప్పులు పోసుకుంటాను.. నిన్ను నావాడ్ని చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను.. నాప్రేమ నిజం.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే పుట్టాను అన్నదీ నిజం.. చూస్తా.. ఎలా రాకుండా ఉంటావో చూస్తాను.. ఎంతకాలం దీప దగ్గరే ఉంటావో చూస్తాను..’ అని తనలో తనే రగిలిపోతుంది. దీప సర్జరీ విషయమై కార్తీక్‌ హాస్పిటల్‌కు వెళతాడు. అక్కడ ఈ విషయమై డాక్టర్‌తో మాట్లాడుతుండగా తులసి(విహారి భార్య) రిపోర్ట్స్‌ చూస్తు ఏడుస్తూ వెళుతుంది. ఆవిడకు ఏమైందని కార్తీక్‌ అడగడంతో డాక్టర్‌ అసలు విషయం చెప్తాడు. 

వారికి పిల్లలు పుట్టరని ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితమే చెప్పానని, అయినా నన్ను నమ్మకుండ ఎక్కడెక్కడో టెస్టులు చెయించుకున్నారంటాడు ఆ డాక్టర్‌. చివరకు అమెరికా వెళ్లి కూడా పరీక్షలు చేయించుకున్నారంటాడు. అక్కడ కూడా లాభం​ లేకపోయే సరికి ఏవో చెట్ల మందులు వాడారు.. మళ్లీ టెస్టు చేయించుకుంది. అవే రిజల్ట్స్‌ వచ్చాయని ఆ డాక్టర్‌ కార్తీక్‌తో చెబుతాడు. దీంతో కార్తీక్‌ లోపం ఎవరీలో ఉందని తడబడుతూ అడగ్గా.. ఆవిడ భర్తలోనే అని చెప్తాడు డాక్టర్‌. దీంతో కార్తీక్‌ గుండె ఒక్కసారిగా బద్దలవుతుంది. వెంటనే దీపను బిడ్డలకు తను తండ్రి కాదని, అంతేగాక పలుమార్లు తులసితో అసభ్యంగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంటాడు. ఇంతలో దీపకు సీరియస్‌ అవుతుంది. నేను పోతే ఆయన మోనితని పెళ్లి చేసుకుంటారా అత్తయ్యా? అని కుమిలిపోతుంది. రేపటి భాగంలో కార్తీక్ ‘నేను తప్పు చేశాను దీప నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయి వాళ్లలానే చూశాను’ అంటు పశ్చాత్తాపంతో కూలబడిపోతాడు. మరోవైపు దీప ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింతో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు