karthika Deepam: మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచింది

24 May, 2021 14:28 IST|Sakshi

కార్తీకదీపం 1047వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం మే 24: సౌందర్య దీపతో మాట్లాడుతుంటే మధ్యలో శౌర్య, హిమ వచ్చి.. దీపకు ముద్దులు పెడతారు. ‘ఏంటమ్మా’ అంటే దీప అడగ్గా నాన్నమ్మ మాకో కథ చెప్పిందమ్మ. అందులో ఇద్దరుంటారు. వాళ్లు ఎవరో కాదు నువ్వు.. నాన్నా.. మీరెంత మంచివాళ్లో నాన్నమ్మ మాకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే ముద్దు పెడుతున్నామంటు వారు మురిసిపోతుంటారు. అది వినగానే దీప కాస్త సంతోషంగా నవ్వుతుంది. తర్వాత హిమ నాన్నమ్మా మాకు అమ్మ కూడా ఓ కథ చెప్పింది. ఆవు పులి కథ. అది వింటే మాకు చాలా ఏడుపొచ్చింది అని దీప చెప్పిన కథను సౌందర్యకు వివరిస్తుంటారు. దీంతో ఆ కథ దీపను ఉద్దేశించే చెప్పిందని తెలుసుకుని, కొన్నిసార్లు పులి చెడ్డది కాదమ్మా.. ఆవులోని అమ్మదనాన్ని, ఆ కమ్మదనాన్ని తెలుసుకుంది. బిడ్డలకి త్లలిని దూరం చేయదు, ఎప్పటికీ దూరం చేయదంటూ భావోద్వేగంతో చెబుతుంది సౌందర్య. 

మరోవైపు  ప్రియమణి వంటలో ఉప్పు లేకుండా మోనితకి పెడుతుంది. అది తిని ఇందులో ఉప్పలేదని అడగ్గానే.. దానికి కావాలనే వేయలేదమ్మా.. మీరు కనిపెడతారా లేదా టెస్ట్‌ చేశా అంటు మోనితకు ప్రియమణి షాకిస్తుంది. దీంతో మోనిత చిరాకుతో తిట్టిపోస్తూ అసహనం చూపిస్తుంటే... ఈ తిట్లన్ని నా మీద కోపంతో కాదమ్మా, కార్తీక్‌ బాబు ఈ మధ్య ఇటు రావట్లేదనే కదా.. కార్తీక్ అయ్య నీ దగ్గరకు సలహాల కోసం.. బాధ చెప్పుకోవడం కోసం మాత్రమే వస్తాడమ్మా.. మీరే నోరు తెరిచి మీ మనసులో ఉన్నది చెప్పాలి.. వచ్చినప్పుడే మాట్లాడండి.. పోట్లాడండి.. రానప్పుడు మాత్రం ఇలా నీరసంగా కూర్చోకండి’ అని అక్కడ నుంచి వెళ్లగానే.. మోనిత తనలో తను నవ్వుకుంటుంది. ‘పిచ్చి ప్రియమణీ నేను సైలెంట్‌గా ఎందుకు ఉన్నానో తెలుసా? చెవులు పగిలిపోయే సౌండ్ వినిపించాలని’ అంటూ పకపకా నవ్వుకుంటుంది.

ఇదిలా  ఉండగా దీప ఇంటికి బయలుదేరిన మురళీ కృష్ణ స్కూటీ పెట్రోల్‌ అయిపోవడంతో మధ్యలో ఆగిపోతుంది. స్కూటీని తోసుకుంటూ వెళుతుంటే మధ్యలో కార్తీక్‌ చూసి కారు ఆపుతాడు. మురళీ కృష్ణ అలసిపోయి తూలి పడిపోబోతుండగా.. అప్పుడే కార్తీక్ స్కూటీని పట్టుకుని సాయం చేస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన్ని అవమానించిన సన్నివేశాలను తలుచుకుంటూ చిన్నబోతాడు కార్తీక్. ‘బాబు మీరా.. మీ దగ్గరికే బయలుదేరాను బాబు.. పెట్రోల్ చూసుకోకుండా వచ్చాను.. పెట్రోల్ పోయించుకుని వస్తాను’ అంటూ స్కూటీ పట్టుకుని కదలబోతాడు మురళీ కృష్ణ. కార్తీక్‌ వెంటనే బండి సైడ్‌కి పెట్టండంటు స్కూటీని పక్కకు తీసుకెళ్లి పార్క్‌ చేస్తాడు. వారణాసికి చెప్పి పెట్రోల్‌ పోయించి తీసుకుర్మమని చెప్తా అంటాడు. అలా అయితే నేను ఎలా రావాలి బాబు అని అడగ్గానే మన కారులో వేళదామనడంతో మురళీ కృష్ణ షాక్‌ అవుతాడు.  

వెంటనే కార్తీక్ మురళీ కృష్ణ రెండు చేతుల్ని పట్టుకుని మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచిందని క్షమాపణలు కోరతాడు. షాక్‌లో ఉన్న మురళీ కృష్ణ తన చేతుల్ని వెనక్కి లాక్కుని ఏంటిది బాబు.. అనగా.. ఏం లేదు.. రండి మామయ్యా అని పిలుస్తాడు. దీంతో మురళీ కృష్ణ అయోమయంగా చూస్తూ.. ‘మీరు.. నన్ను.. మామయ్యా అని..’ అంటూ కన్నీళ్లుపెట్టుకునేసరికి.. ‘నేను మీ పెద్ద అల్లుడ్ని మామయ్యా.. రండి’ అంటూ కారులోంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇస్తాడు. ‘బాబూ.. దీప.. బాగానే ఉంది కదా’ అని మురళీ కృష్ణ అగడంతో.. ‘బాగుంది.. బాగుంటుంది. నేను ఉండగా దీపకు ఏం కాదు.. కానివ్వను అంటాడు. దీంతో మురళీ కృష్ణ ‘దీప ఆరోగ్యానికి ప్రమాదామా బాబు’ అని అడగ్గా.. దీప ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది.. నా మాట నమ్మండి అని నచ్చజెప్పి కారు ఎక్కమంటాడు.

దాంతో మురళీ కృష్ణ.. ‘ఏంటి ఈయన ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు? నా కూతురు సంతోషంగా ఉంటుంది అంటున్నాడు’ అని ఆలోచించుకుంటూ ఉండగా.. కార్తీక్.. ‘మామయ్యా ఎక్కండి’ అని మరోసారి పిలుస్తాడు. ఇద్దరు కలిసి ఇంటికి బయటుదేరుతారు. ఇదిలా ఉండగా.. సౌందర్య దీపని పిలిచి టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తుంది. దీప వేసుకుని.. తన పవిత్రతని నిరూపించుకోలేనందుకు బాధపడుతూ సోఫాలోకి పడిపోతూ సృహ కోల్పోతుంది. కట్‌ చేస్తే దీపను హాస్పిటల్‌కు తీసుకువెళ్లిన సీన్‌ను తరువాయి భాగంలో చూపిస్తారు. దీప ఇదే తన చివరి క్షణం​ అన్నట్లుగా కార్తీక్‌తో మాట్లాడుతూ.. ఇప్పటికైన నమ్మానని చెప్పండి డాక్టర్‌ బాబు ప్రశాంతంగా వెళ్లిపోతానంటూ కళ్లుమూస్తుంది. 

మరిన్ని వార్తలు