karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప

14 May, 2021 15:41 IST|Sakshi

కార్తీకదీపం 1039వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం మే 14: కార్తీక్‌ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ దీపతో టాబ్లెట్స్‌ వేసుకో, బాగా విశ్రాంతి తీసుకో జాగ్రత్తగా ఉండని చెబుతూ బయలుదేరుతాడు. దీంతో దీప నన్ను భార్యగా చూడనప్పుడు నా జీవితానికి ఎందుకు అడ్డుపడుతున్నారని కార్తీక్‌ను నిలదీస్తుంది. దీనికి కార్తీక్‌ ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే అడ్డుకుని నాకు సమధానం కావాలంటుంది. కార్తీక్‌ చెప్పకుండా దాటేస్తుంటే ఇలా నన్ను బాధపెట్టెకంటే ఒక్కసారిగా చంపేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది దీప. అంతేగాక కార్తీక్‌ చేతులను పట్టుకుని చంపేయండి, చంపేయండి అంటూ అరుస్తుంది.

దీంతో కార్తీక్‌ తన చేతులను విడిపించుకుని.. భావోద్యేగంతో అసలు విషయం బయట పెడతాడు. ‘నిన్ను ఎవరూ చంపనవసరం లేదే.. నువ్వే చావబోతున్నావంటూ’ విలపిస్తాడు. దీంతో దీప అయోమయంగా చూస్తూ నేను చావడం ఏంటి, అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన చెందుతుంది. సమయానికి మందులు వేసుకోవాలి, మంట సెగ తగలనివ్వకూడదు, ఆవిరి పీల్చకూడదు అలాగే ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి, ఇప్పటికే చావు అంచులదాక వెళ్లావు అంటూ దీపను హెచ్చరిస్తాడు  కార్తీక్‌. అలా షాక్‌లో ఉండిపోయన దీప... అయినా నేను శారీరకంగానే చచ్చిపోతున్నాను, మానసికంగా మీరు చంపేస్తూనే ఉన్నారు కదా అంటుండగా.. కార్తీక్‌ నీ పేరులోని దీపం వేడి కూడా నిన్ను కాల్చేసి చంపేస్తుందే అని అంటాడు. అలా కార్తీక్‌ మాట్లాడుతుంటే దీప అత్తింట్లో తనతో డాక్టర్‌బాబు ప్రవర్తించి తీరు గుర్తుచేసుకుంటుంది.

ఆ తర్వాత దీపతో మన ఇంటికి వెళదాం పదా అని అడుగుతుంగా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులు జోడించి అడుగుతుంది దీప. దీంతో బయటక వెళ్లిపోతాడు కార్తీక్‌. ఇదిలా ఉండగా మోనితకు నిద్ర పట్టక సతమతవుతుంది. ‘ఎందుకు నేను ఒంటరిదానిలా ఫీలవుతున్నా.. కార్తీక్‌ మళ్లీ దీప ఇంటికి వెళ్లాడనా, లేక కార్తీక్‌, భారతిలు ఎలాగైన దీపను బతికిస్తారనా’ అని తనలో తనే అనుకుంటుంది. ఇక కార్తీక్‌ నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఎన్నో సార్లు అవమానించాడు, దీప వాళ్లు అవమానించేలా మాట్లాడినా ఏం అనకుండా చూసేవాడు. ఇక నుంచి కార్తీక్‌ అసలు నాఅంతట నేను ఫోన్‌ చేయను, ఎలాగైనా కార్తీక్‌ నా చూట్టు తిరిగేలా చేసుకుని, నా వాణ్ణి చేసుకుంటానంటూ తనని తాను సముదాయించుకుని పడుకుంటుంది. ఇక దీప ఇంట్లోనే హాల్లో కార్తీక్‌ సోఫాలో పడుకుని ఉండగా జరిగిందంతా గుర్తు రావడంతో నిద్ర నుంచి లేస్తాడు.  

ఇంతలో వాటర్‌ కోసం అటు వచ్చిన సౌర్య కార్తీక్‌ను చూసి నిద్ర పట్టలేదా నాన్న అని అడుగుతుంది. అవును రౌడి అంటూ.. ఇక్కడ నన్ను సడెన్‌గా చూసి భయం వేయలేదా అడగ్గా.. రౌడీని కదా వేయలేదంటుంది. ఇక మీ అమ్మ పడుకుందా అని అడుగుతాడు కార్తీక్‌, దానికి సౌర్య లేదు నాన్న కూర్చోని ఆలోచిస్తూనే ఉందని చెబుతుంది. ఇంతలో బెడ్‌రూంలో హిమ, దీపలు పడుకుని ఉంటారు. హిమ అమ్మ ఎందుకని అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ఉండకుండా ఏ సౌకర్యాలు లేని ఈ ఇంటికి వచ్చేసింది. అక్కడ అయితే కొత్త బెడ్‌షిట్స్‌, కొత్త బెడ్‌లు ఇంట్లో పనివాళ్లు ఉంటారు అక్కడ ఉండక..  ఎందుకు పాత బెడ్లు, పాత బెడిషిట్‌ ఉన్న  ఈ ఇంటికి తిరిగి వచ్చిందని ఆలోచిస్తుంది. ఇటూ కార్తీక్‌ సౌర్యతో సర్లే వెళ్లి పడుకో ఎలాగోలా ఇక్కడే పడుకుంటానని, మీ అమ్మతో నేను ఇక్కడే ఉన్నట్లు చెప్పకు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు