karthika Deepam: కార్తీక్‌ స్పర్శతో కళ్లు తెరిచిన దీప

28 May, 2021 14:32 IST|Sakshi

కార్తీకదీపం 1051వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం మే 28: కార్తీక్‌, మోనితతో నా భార్య బతకాలి అంటూ దీప మీద ప్రేమ, కన్సర్న్‌ చూపించడంతో మోనిత తట్టుకోలేపోతుంది. దాంతో తాను అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీపకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి తనని మత్తలోకి వెళ్లకుండా మెలకువతో ఉండమని చెబుతారు. మరోవైపు సౌందర్య బయట కూర్చోని దీప అరోగ్యంపై దిగులు పడుతూ ఉంటుంది. మరి దీప ఆరోగ్యం బాగావుతుందా, కార్తీక్‌ ప్రవర్తనతో రగిలిపోతున్న మోనిత ఏం చేయనుందో నేటి ఎపోసిడ్‌(మే 28) ఇక్కడ చదవండి.. 

కార్తీక్, సౌందర్య దీప పరిస్థితి గురించి మాట్లాడుకుంటుండగా.. డాక్టర్‌ భారతి వచ్చి ఫార్మాలిటీస్‌ మరిచిపోయాను.. సైన్ చెయ్యి అనడంతో కార్తీక్‌ సైన్ చేస్తాడు. అది చూసి దీపకు ఏమౌంతుందోనంటూ భయపడుతున్న సౌందర్యకు.. దానికి ఏం కాదు మమ్మీ అంటు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు కార్తీక్‌. అప్పటికే పిల్లలు దీప కోసం కంగారుపడుతుంటే ఆదిత్య వారికి ఓదార్పు మాటలు చెబుతుండగా.. సౌందర్య ఇంటికి రావడంతో నానమ్మ అంటు హిమ, శౌర్య దగ్గరకి వెళ్లి పట్టుకుని ఏడుస్తారు. అమ్మకు ఏమైనా అవుతుందని భయపడుతున్నారా, అక్కడ దానికి ఏం కాలేదు రెండు రోజుల్లో ఇంటికి వస్తుందంటూ మనసులో భయపడతూనే పిల్లలకు ధైర్యం చెబుతుంది. అది గమనించిన ఆదిత్య పిల్లలు మాలతితో వెళ్లగానే ఏంటి వదిన పరిస్థితి బాగాలేదా అని అడగ్గా అవునని తల ఊపుతుంది, దీప ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తుంది.

ఐసీయూలో పడుకుని ఉన్న దీపను కార్తీక్‌ బయట డోర్‌ నుంచి చూస్తూ.. ‘నువ్వు బాగుండాలి దీపా.. నీకేం కాకూడదు.. క్షేమంగా బయటికి రావాలి. ఇక నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను దీపా.. కష్టాలే లేని నీ స్వప్నలోకాన్ని నీకు అందిస్తాను’ అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే దీపకు పల్స్‌ పడిపోయి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. దీంతో కార్తీక్ కంగారుగా భారతి దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘భారతి.. గోవర్ధన్... దీపా పల్స్‌రేట్ పడిపోతుంది.. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది’ అని కంగారుగా పడుతుండటంతో ‘వాట్?’ అంటూ గోవర్ధన్‌తో పాటు భారతి కంగారుపడుతూ.. దీప ఉన్న ఐసీయూలోకి పరుగుతీస్తారు. ‘‘భారతి దీపను చెక్‌ చేస్తుంటే మధ్యలో కార్తీక్‌ ఏమైంది.. ఏమైంది అంటూ ఆందోళన పడుతుంటాడు. దీంతో భారతి డాక్టర్‌ గోవర్ధన్‌తో కార్తీక్‌ని ఐసీయూ నుంచి బయటికి తీసుకెళ్లమని చెబుతుంది. 

ఇదిలా ఉండగా హాస్పిటల్‌లో జరిగిదంతా తలుచుకుంటూ మోనిత కోపంతో మండిపోతుంది. అదే సమయంలో ప్రియమణి భోజనం తెస్తుంది. కార్తీక్ దీపల గురించి ఆరా తియ్యడంతో ఆ ప్లేట్ విసిరి కొట్టి.. క్లీన్ చెయ్ అంటూ ముందు గదిలోకి వస్తుంది మోనిత. ‘దీప అనారోగ్యం కార్తీక్‌లో ఇంత మార్పుకు కారణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.. ఇన్నాళ్లు దీపకు దూరంగా ఉంటే ఏదో ఒకరోజు నాకు దగ్గర కాకపోతాడా అని ఆశతో ఉండేదాన్ని. కానీ ఈ రోజుతో అది అడియాశేనని తేలిపోయింది. ప్రేమగా కార్తీక్‌ని నా కార్తీక్ అనుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది.. నా కార్తీక్‌ని నాకు దూరం చేసిన ఆ దీపని మాత్రం కార్తీక్‌కి దగ్గర అవ్వనివ్వను.. అలాగే ఆ దీపని అస్సలు ఉండనివ్వను. కార్తీక్ దీపలు కలిసి సంతోషంగా ఎలా ఉంటారో నేనూ చూస్తా, ఇప్పుడే కాదు.. ఇంకో 100 ఏళ్లు అయినా మిమ్మల్ని కలవనివ్వకుండా దూరం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది.. ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను’ అంటు ఉన్మాదంగా ఆలోచిస్తుంది. 

ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన సౌందర్య.. కార్తీక్‌ మాటలను గుర్తు చేసుకుంటూ అనుమానమే లేదు పెద్దోడిలో మార్పు వచ్చింది. దీపని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ పదేళ్లుగా రాని మార్పు ఈ రెండు రోజుల్లో ఎలా వచ్చింది? ఏం జరిగి ఉంటుంది? అని ఆలోచిస్తుంది. ఏమైతేనేం వాడిలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు దీప చూస్తుందో లేదా అంతా నీదే భారం స్వామి అని బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్‌ దగ్గర కార్తీక్ దీప గురించి బాధపడుతూ ఉండగా.. డాక్టర్ భారతి వచ్చి.. నువ్వు మంచివాడివి కార్తీక్.. నీకు ఆ దేవుడు అన్యాయం చేయడు, దీప సేఫ్ అనడంతో ఒక్కసారిగా కార్తీక్‌ ప్రాణాలు లేచోస్తాయి. దీంతో నేటి ఎపిపోడ్‌ పూర్తిఅవుతుంది. 

తరువాయి భాగం.. సృహలో లేని దీప దగ్గరకు కార్తీక్ వెళ్లి.. తల నిమురుతూ.. ‘రెండే రెండు రోజులు ఆగు దీపా ప్రపంచంలో ఏ జంట ఇంత ఆనందంగా ఉండరు అనిపించేలా.. మనం ఉందాం..’ అంటాడు. వెంటనే దీప పక్కనే కూర్చుని.. దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని.. ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు.. క్షమించరాని ఘోరమైన అపరాదం.. వీటన్నింటికీ నేను క్షమాపణ చెప్పుకోవాలి.. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను..’ అంటూ దీప చేతుల్ని ముద్దాడుతూ ఏడుస్తుండగా, ఆ స్పర్శకు దీప కళ్లు తెరిచి చూస్తుంది.

మరిన్ని వార్తలు