karthika Deepam: ఎవరు ఎన్ని అనుకుంటే నాకేంటి? నా భార్య బతకాలి..

27 May, 2021 14:26 IST|Sakshi

కార్తీకదీపం మే 27: కార్తీక్‌ దీపతో సరదాగా మాట్లాడటం, నిన్ను బతికించుకోవడం భర్తగా నా కనీస బాధ్యత అని అనడంతో అది విన్న మోనిత కోపంతో రగిలిపోతుంది. ఇక కార్తీక్‌ దీప ఆరోగ్యం గురించి దిగులు పడుతుంటాడు. ఇక అక్కడే హాస్పిటల్‌లో కార్తీక్‌కు ఏమైందంటూ ఆలోచిస్తున్న మోనిత ఏం చేయబోతుంది, కార్తీక్‌ దీపతో నిజం తెలిసిన విషయం చెబుతాడో లేదో నేటి(మే 27) ఎపిసోడ్‌ ఇక్కడ చదవండి..

కార్తీక్‌ను సౌందర్య ఓదారుస్తు అది నిన్ను చివరి క్షణాలంటూ.. నన్ను నమ్మానని చెప్పండి అని అడుగుతుంటే ఎందుకురా నోరు మెదపలేదని అడగ్గా కార్తీక్‌ ఏమో నోరుకు ఎదో అడ్డుపడినట్లు అయ్యింది అంటాడు. నువ్వు నమ్మానని ఒక్క మాట చెబితే ఆ మాటలతో అది ధైర్యం తెచ్చుకుని మరణంతో కూడా పోరాడి తిరిగోచ్చేది కదరా ఇది నువ్వు ఓ డాక్టర్‌ బాబుగా కాదు డాక్టర్‌లా చెప్పు అని సౌందర్య అనగా.. కార్తీక్‌ అవునన్నట్లు తల ఊపుతాడు.  అయిన దానికి ఏం కాదు మమ్మీ.. అది ఎవరూ దీప బతికేస్తుంది.. అది బతకాలి.. బతుకుతుంది అంటాడు కార్తీక్‌. ఇంతలో మురళీ కృష్ణ యాపిల్‌ పండ్లు తీసుకువచ్చి సౌందర్య, కార్తీక్‌కు​ తినమని ఇస్తాడు. కార్తీక్‌ అవి తీసుకుని సౌందర్యకు ఒకటి ఇచ్చి, మరోకటి  మీరు ఏం తినలేదు కదా మామయ్య ఇది మీరు తీసుకోండి అంటు ఆ యాపిల్‌ను మురళీ కృష్ణకు ఇస్తాడు.

ఇక అది విన్న సౌందర్య షాక్‌ అవుతుంది. ఏం అన్నాడు వాడు అని మురళీ కృష్ణను అడగ్గా నోరరా మామయ్య అన్నాడమ్మా అనగానే సౌందర్య సంతోషంతో కార్తీక్‌ను చూస్తుండిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ మోనిత కార్తీక్‌ ఏంటి దీపతో అల మాట్లాడాడు. అంటే కార్తీక్ ఇప్పటి దాకా నా మీద చూపించింది ప్రేమ కాదు అనుకుంటుంది. కనీసం విజయనగరం నుంచి పెళ్లాం, పిల్లలను విమానంలో తీసుకొచ్చినప్పుడైనా నాకు సిగ్గు ఉండాలి కదా? లేదు నేను కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడం కోసం నేను చేసిన దరిద్రగొట్టు పనులన్నీ ఇంకే ఆడది చెయ్యదు.. ఇంత కథ నడిపినా ఇన్నేళ్లకు కూడా నా బతుక్కి మోక్షం లేదు.. చావాలనిపిస్తోంది అంటూ తనలోనే తానే మాట్లాడుకుంటుంది.  సరిగ్గా అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్‌ అని అడగడంతో.. దీప గురించే అని కవర్ చేస్తుంది మోనిత.

అంటే.. భారతి ఏమైనా చెప్పిందా అని కంగారుగా అడగ్గా భారతి నాకు చెప్పడం ఏంటీ? దీప గురించి అంటుంది మోనిత. నా భార్య గురించి నాకు చెబితే నేను తట్టుకోలేనని నీతో ఏమైనా చెప్పిందా? అని అడుగుతున్నాను మోనితా.. చెప్పి ఉంటే నిజం చెప్పు.. అవసరం అయితే స్పెషల్ డాక్టర్స్‌ని పిలిపిస్తాను అని కార్తీక్‌ అనడంతో మోనిత ఇంకా కోపంతో రగిలిపోతుంది. మొగుడితో చెప్పకుండా నాతో ఎందుకు చెబుతుందని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత మోనిత నువ్వు నిజంగా బాధపడుతున్నావా? పిల్లలు బాధపడతారని బాధపడుతున్నావా అని వెటకారంగా అనడంతో.. ‘పిల్లల గురించి కాదు.. లోకం గురించి కాదు.. భర్తగా ఇది నా బాధ్యత అని కూడా కాదు.. దీప బతకాలి.. బతికి తీరాలి.. ఇన్నాళ్లు దీప ఎన్నో కష్టాలు పడింది.. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రాణాలతో పోరాడుతుంది.

ఎవరు ఎన్ని రకాలుగా అనుకుంటే నాకేంటీ? ఐ డోంట్ కేర్..నా భార్య బతకాలి..దట్స్ ఆల్’ అని అంటాడు కార్తీక్ ఆవేశంగా అంటాడు. అది విన్న మోనిత ‘ఇది జాలి కాదు.. మానవత్వం కాదు..మరేదో ఉంది..’ అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత మోనిత నేను వెళతాను అనగానే కార్తీక్‌ మంచిది అని ఇచ్చిన సమాధానాన్ని మోనిత ఊహించలేకపోతుంది. దీంతో ఆమో మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోతాయి. వెంటనే కార్తీక్ ఉండొచ్చు కదా.. భారతికి తోడుగా అనగా నువ్వు ఉన్నావ్‌గా ఫ్రెండ్‌గా అనుకుంటు అక్కడ నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు డాక్టర్‌ భారతి దీపకు ఒక ఇంజక్షన్ ఇస్తూ ఇంజక్షన్‌ ఇచ్చాక మత్తుగా ఉంటుంది కానీ పడుకోవద్దని చెబుతుంది. ఇంజక్షన్‌ ఇవ్వగానే దీప మత్తు రావడంతో పడుకుంటుండగా డాక్టర్ భారతి దీపతో పడుకోవద్దని లేపుతుంది.

ఆ తర్వాత సౌందర్య, కార్తీక్‌లు అక్కడికి వస్తారు. దీపతో ధైర్యంగా ఉండు.. నిద్ర అసలు పోకుడదంటుంటే దీప సరే అన్నట్లు నవ్వుతూ తల ఊపుతుంది. సౌందర్య కూడా చెప్పడంతో ఆమెనే చూస్తూ దీప చిరునవ్వు చిందిస్తుంది. నాకు ధైర్యం చెప్పడం కాదే నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్‌ సౌందర్యలను మీరు వెళ్లండి నేను చూసుకుంటా అని చెప్పి బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత కార్తీక్‌ సౌందర్యతో నువ్వు ఇంటికెళ్లు మమ్మీ నేను ఉంటానంటే, నువ్వే వెళ్లరా ఫ్రెష్‌ అయ్యి కాస్తా తిని రమ్మనగా అది ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వెళతాను మమ్మీ.. ఇక్కడే ఉంటానని అంటాడు కార్తీక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు