Karthika Deepam: క్షీణించిన దీప ఆరోగ్యం, ఆందోళనలో డాక్టర్‌ బాబు

26 May, 2021 10:54 IST|Sakshi

కార్తీకదీపం 1049వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం సీరియల్‌.. దీప ఆరోగ్యం దిగజారిపోవడంతో కార్తీక్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేపిస్తాడు. ఆ విషయం తెలుసుకుని మోనిత ఆస్పత్రికి వచ్చిన మోనిత ఎలాంటి ప్లాన్‌తో ఉందో తెలియదు. మరోవైపు ఎలాగైనా దీపను బతికించుకోవాలని చూస్తున్న డాక్టర్‌ బాబు ప్రయత్నం తిరుతుందా లేదంటే మోనిత కొత్తగా దీపపై ఎమైనా పన్నాగాలు పన్ననుందా అనేది తెలుసుకోవాలంటే  నేటి(మే 26) ఎపిసోడ్‌ ఇక్కడ చదివేయండి..

కార్తీక్‌, డాక్టర్‌ భారతి, డాక్టర్‌ గోవర్థన్‌లు మాట్లాడుకుంటుంటే మోనిత అక్కడకు వస్తుంది. వారిని పలకరించినప్పటికీ ముగ్గురు మోనితను పట్టించుకోకుండా వారు సీరియస్‌గా డిస్కషన్ చేసుకుంటున్నారు. దీంతో ‘హాలో.. నేను కూడా డాక్టర్‌నే, నన్న కాస్త గుర్తించండి. నాతో కూడా  డిస్కషన్ చేయోచ్చు’ అని మోనిత అంటుంది. దీంతో భారతి మొదటి నుంచి చెప్పలేము.. దీపకు పదేళ్ల క్రితం ఎవరో స్లోపాయిజన్‌ ఇంజెక్ట్‌ చేశారు అనగానే మోనిత ఒక్కసారిగా కంగుతింటుంది. అది ఇన్నాళ్లుగా మెల్లిమెల్లిగా ప్రతి టిష్యును డ్యామెజ్‌ చేసుకుంటు.. ఒక్కో ఆర్గాన్‌ పనిచేయకుంగా చేస్తూ వస్తోంది. ఆ డ్రగ్‌ బయటకు వెళ్లే అవకాశం లేదు అందుకే బ్లడ్‌ ప్యూరిఫై చేయాల్సి వచ్చింది. దానికి డయాలసీస్‌ తప్ప వేరే మార్గం లేదు’ అని భారతి వివరిస్తుంది. అలాగే డాక్టర్‌ గోవర్ధన్‌ కూడా దీప ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటాడు. 

మరోవైపు పిల్లలు(హిమ, శౌర్య) ఇంటి దగ్గర దిగులుగా ఉంటారు. వారణాసి వాళ్లకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత వారణాసితో అమ్మకు ఏంకాదు కదా.. ఏం కాదమ్మా.. అక్కడ ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, వాళ్లు అమ్మకు ఏం కాకుండా చూస్తారు. మీ డాడి కూడా డాక్టరే కదా అని వారికి సర్ది చెబుతాడు. ఇక హిమ ఇక్కడే ఉంటే అమ్మ గుర్తోస్తుంది నానమ్మ వాళ్ల ఇంటికి వెళదాం.. వారణాసి మమ్మల్ని అక్కడ దీంపుతావా అని అడుగుతుంది. శౌర్య కూడా అవును మనం ఇప్పుడు ఇక్కడ కంటే ఆదిత్య బాబాయ్‌, పిన్నితో ఉండటమే కరెక్ట్‌ అని అక్కడి వెళ్లతారు. ఆస్పత్రి దగ్గర మోనిత, భారతిలు దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. దీపను ఇప్పుడు ఎలా ఉంది అని భారతి అడగ్గానే ఇంటికి ఎప్పుడు వెళ్లోచ్చు రేపా, ఎల్లుండా అని అనగా.. గుడ్‌ ఇలా ధైర్యంగా ఉండాలి అంటుంది భారతి.

ఆ తర్వాత దీప నా భర్తను చూడాలని ఉంది, ఆయన్ని పిలవండి అని భారతికి చెబుతుంది. ఆ తర్వాత మోనిత పలకరిస్తూ ఎలా ఉన్నావ్‌ దీప అనగానే నన్ను ఇలాంటివి ఏం చేస్తాయి, నీలాంటి మహమ్మారే ఏం చేయలేకపోయింది అంటూ మోనితకు కౌంటర్‌ వేస్తుంది దీప. ఆ తర్వాత నాకు తెలుసు నేను లేకపోతే నా భర్తను పెళ్లి చేసుకుంటావని, నీకు ఆ అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను ఉండగా నా భర్తను చేసుకునే ధైర్యం నువ్వు చేయవు అంటుంది దీప. మోనిత కార్తీక్‌ వస్తున్నట్లు గమనించి.. ‘నువ్వు బతకాలి దీప. నిండు నూరేళ్లు బతికి నీ భర్త, పిల్లలతో హాయిగా ఉండాలి’ అంటు దొంగ ఏడుపు ఏడుస్తుంది. కార్తీక్‌ రాగానే గెట్‌ అవుట్‌ దీప నా భర్తతో మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత మోనిత బయటకు వెళ్లి డోర్‌ నుంచి వాళ్లను గమనిస్తుంది.

ఇక కార్తీక్‌, దీపలు ఒకరిని ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. కార్తీక్‌ చెప్పు వంటలక్కా అని పిలవగానే దీప నవ్వుతుంది. ఇలా నవ్వుతూ ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి దీప అంటు కాస్త సరదాగా మాట్లాడుతాడు. నువ్వు మీ డార్లీంగ్‌ అత్తయ్యాతో షాపింగ్‌ అని తిరగాలి, పిల్లలకు రకరకాల వంటలు వండిపెట్టాలి. దొసకాయ పచ్చడి పిల్లలకే కాదు కాలనీ మొత్తం పంచాలంటూ దీప కార్తీక్‌తో మాట్లాడం చూసి మోనిత షాక్‌ అవుతుంది. ఇక నాకు ఏమైన అయితే డాక్టర్‌ బాబు అనగానే స్టుపిడ్‌ నీకు ఏం కాదు ఇంకోసారి అలా మాట్లాడకు అని కార్తీక్‌ అక్కడి నుంచి వెళ్లి సౌందర్య పక్కన కూర్చుంటాడు. 

బయట సౌందర్య భుజం మీద తల వాల్చగానే సౌందర్యతో అది చివరి క్షణాలు అంటూ ఇప్పటికైనా నమ్మనని చెప్పండి అని చేతిలో చెయ్యేసి అంత ధీనంగా అడిగినప్పుడు కూడా నీకు చెప్పాలనిపించలేదారా, ఏం మాట్లాడకుండ అలా మౌనంగా ఉండిపోయావు అని అడుగుతుంది. ఆ తర్వాత తరువాయి భాగంలో కార్తీక్‌ దీప రూం బయట నిలుచుని నీకు ఏం కావద్దు నువ్వు బ్రతకాలి దీప అని మనసులో అంటుండగా దీప పల్స్‌రేట్‌ పడిపోతుంది. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. వెంటనే కార్తీక్‌ డాక్టర్‌ భారతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి దీప పరిస్థితి గురించి చెబుతాడు. వెంటనే వాళ్లు అక్కడికి వెళ్లి చెక్‌ చేస్తుంటారు.

చదవండి: కార్తీకదీపం: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు

మరిన్ని వార్తలు