Karthika Deepam: దీప ఆరోగ్యంపై దిగులు పెట్టుకున్న శౌర్య, హిమ

19 May, 2021 15:02 IST|Sakshi

కార్తీకదీపం మే 19: దీప డాక్టర్‌ బాబును కార్తీక్‌ అని పిలుస్తుంది. ఇది కూడా తన పదేళ్ల కోరిక అని మిమ్మల్ని ఎప్పుడైన కార్తీక్‌ అని పిలవాలనిపించేది డాక్టర్‌ బాబు అని చెబుతుంది. అంతేగాక వారం, పది రోజుల్లో పోయేదాన్ని ఇప్పుడే ఇలాగే మీ ఒడిలో తలపెటుకుని కన్నుమూయాలనుంది అంటూ ఏమోషనల్‌ అవుతుంది. దీంతో కార్తీక్‌.. డాక్టర్లు, మందులు ఉన్నవి మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తుండటానికి కాదు అని అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లి స్నానం చేసి వస్తే టిఫిన్‌ పెడతాను, ఆ తర్వాత టాబ్లెట్‌ ఇస్తా అంటూ దీప చేతిలో ఉన్న కాఫీ ​గ్లాస్‌ తీసుకుని వెళతాడు. ఆ తర్వాత డాక్టర్‌ బాబు తనను చేతితో తాకడానికి కూడా ఆలోచిస్తున్నాడంటే.. ఇదంత తన మీద ప్రేమతో కాదని జాలితో చేస్తున్నాడనుకుంటుంది.

ఆ తర్వాత దీప స్నానానికి వెళ్లడంతో కార్తీక్‌ పిల్లలతో కలిసి టిఫిన్‌ చేస్తాడు. ముగ్గురు కలిసి టిఫిన్‌ చేస్తుంటే శౌర్య, హిమలు మమ్మీ కూడా మనతో కలిసి టిఫిన్‌ చేస్తే బాగుండు అనుకుంటారు. అమ్మ రోజు పొద్దున్నే లేచి ఇళ్లు ఉడిచి, ముగ్గు పెట్టి మాకోసం టిఫిన్‌ తయారు చేసి అప్పడు లేపేది. ఇలా అమ్మను ఎప్పుడు చూడలేదంటు దిగులు పడుతుంటారు పిల్లలు.  దీంతో కార్తీక్‌ మమ్మీకి ఏం కాలేదు కాస్తా నిరసంగా ఉందంతే. టాబ్లెట్స్‌ వేసుకుని, కొన్ని రోజులు వంట దగ్గరికి రాకుండ ఉంటే చాలు అంటాడు. దీంతో హిమ అయితే మాకు ఇప్పుడు నువ్వు వంట పనుల్లో కొంచం సాయం చేస్తే చాలు, పెద్దాయ్యాక మాకెవరి సాయం లేకుండా మేమే వంట చేస్తామని కార్తీక్‌తో అంటుంది. అంతేగాక అప్పుడు అమ్మను కుర్చోబెట్టి తనకు ఇష్టమైనవన్ని చేసి పెడతామని, అమ్మకు నచ్చిన సినిమాలు, పుస్తకాలు కొనిపెడతామంటూ ఇద్దరూ అంటుంటే.. కార్తీక్‌ దీప బతకదు అని డాక్టర్‌ భారతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. 

ఇదిలా ఉండగా మోనిత చాలా హుషారుగా కనిపిస్తుంది. ప్రియమణి టీ తీసుకురావడానికి ముందే మోనిత లేచి స్నానం చేసి దేవుడికి దీపం ముట్టిస్తుంది. అది తెలుసుకుని ప్రియమణి షాక్‌ అవుతుంది. మీరేంటి దీపం ముట్టించడమేంటి అమ్మగారు.. అలా మీరు దేవుళ్లను ఇరకాటంలో పెడితే ఏలా అమ్మగారు అంటు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంది. ఎప్పటికైనా చేయాలి కదా ప్రియమణి.. రేపు కార్తీక్‌ని పెళ్లి చేసుకున్నాక పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ కప్పుతో కార్తీక్‌ను లేపాలి కదా అంటు మురిసిపోతుంది. ప్రియమణి కారు కడుగుతుంటే, మోనిత టీ తాగుతూ బయటకు వస్తుంది. ఆడవాళ్లు ఇలా కారు కడగడం మొదటిసారి చూస్తున్నానని మోనిత అనగానే.. ఆడవాళ్లతో కారు కడిగించే వాళ్లను కూడా నేను ఇప్పుడే చూస్తున్నా అంటుంది. నా దగ్గర పని చేస్తే వాళ్లు ప్రపంచంలో ఎక్కడైన బతుకుతారంటూ మోనిత గర్వంగా చెబుతుంది.

హా.. నేను పెళ్లి చేసుకుని వెళ్లాక మీకు ఎలాంటి పనివాళ్లు దొరుకుతారో చూస్తా అంటుంది ప్రియమణి. దీంతో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా చేసుకోను అన్నావ్‌ కదే అని అంటుంది మోనిత. అప్పుడు అలా అన్నాను కానీ ఇప్పుడు చేసుకుంటా అంటుంది. నా పెళ్లి అయ్యే వరకు నువ్వు పెళ్లి చేసుకునేది లేదు అనగానే ప్రియమణి.. ఏంటమ్మా మీ పెళ్లి అయ్యాకా నేను చేసుకోవాలా.. అప్పటికి నా వయసు కూడా అయిపోతుంది.. మీ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నారా, కార్తీక్ అయ్య దీపమ్మను తెచ్చి ఇంట్లో పెట్టి.. దీపా పాపా అంటూ మందులు పట్టుకుని ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉంటే..మీ పదహారేళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా మీ పెళ్లి మాత్రం జరగదు అని వాదిస్తుంది . ప్రియమణి మాటలకు మోనిత రగిలిపోతుంది. అయినప్పటికీ కోపాన్ని ఆపుకుంటు ఈ టైంలో అసలు కోపం తెచ్చుకోవద్దు, చూద్దాం ఏం జరుగుతుందో అని మనసులో  అనుకుంటుంది. ఇక దీప స్నానం చేసి రెడీ అయ్యి రాగానే కార్తీక్‌ టిఫిన్‌ పెట్టి, టాబ్లెట్స్‌ ఇస్తాడు. ఆ తర్వాత దీప ఇదంతా నా మీద ప్రేమతో కాకుండా జాలితో చేస్తున్నారు కదా డాక్టర్‌ బాబు అని అడుగుతుంది. దీంతో నేటి ఎపిసోడ్‌ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

మరిన్ని వార్తలు