మైనస్‌ డిగ్రీలు: ఆగిపోయిన 'కార్తికేయ 2' షూటింగ్‌‌!

25 Mar, 2021 08:36 IST|Sakshi

మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ‘కార్తికేయ 2’ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. నిఖిల్, అనుపమా పరమేశ్వర్వన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ గుజరాత్‌లో జరిగింది.

తాజా షెడ్యూల్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిస్సులో ఆరంభించారు. అయితే అక్కడ మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘‘పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల షూటింగ్‌ను ప్రస్తుతానికి ఆపేశాం. త్వరలో ఈ లొకేషన్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.

చదవండి: లవర్‌ బాయ్‌ తరుణ్‌ రీఎంట్రీ, ఈ సారి..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు