ఇది నాకు ఎంతో ప్రత్యేకం: అనుపమ పరమేశ్వరన్‌

10 Aug, 2022 07:10 IST|Sakshi
మాట్లాడుతున్న హీరో నిఖిల్‌

సీతమ్మధార (విశాఖ ఉత్తర): శ్రీ కృష్ణుని ద్వారక ఇతివృత్తంగా కార్తికేయ–2 చిత్రం రూపొందించినట్లు హీరో నిఖిల్‌ తెలిపారు. సాంకేతికపరంగా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్, ప్రేమ, యాక్షన్‌ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. కార్తికేయ–2 చిత్రం ట్రైలర్‌ను శరత్‌ థియేటర్లో మంగళవారం చిత్రయూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ప్రేక్షకుల ముందు ట్రైలర్‌ విడుదల చేసి, కాసేపు ముచ్చటించారు.
చదవండి: సుష్మితా సేన్ లైవ్‌ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్‌.. లలిత్ ఎక్కడ?

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్‌ మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి కథనంపై రూపొందించిన కార్తికేయ–1 చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారన్నారు. ద్వారకలోని శ్రీ కృష్ణుడి గుడి చుట్టూ జరిగే కథాంశం ఆధారంగా కార్తికేయ–2 చిత్రాన్ని రూపొందించామన్నారు. తమ సినిమాను శ్రీకృష్ణుడే ముందుకు నడిపారని, షూటింగ్‌ సమయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పారు.

దర్శకుడు చందూ మొండేటి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ నెల 13న చిత్రాన్ని పాన్‌ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ కార్తికేయ–2, చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రేక్షకులు చూసినంత సేపు తర్వాత ఏమి జరుగుతుందో అని ఉద్వేగానికి గురవుతారన్నారు. చిత్రనటులు శ్రీనివాసరెడ్డి, హర్ష మాట్లాడుతూ ఇంత గొప్ప చిత్రంలో నటించడం ఆనందంగా  ఉందన్నారు. 

మరిన్ని వార్తలు