Karthikeya 2 Twitter Review: కార్తికేయ 2 ట్విటర్‌ టాక్‌ ఎలా ఉందంటే..

13 Aug, 2022 07:25 IST|Sakshi

నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌  ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది.

దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘కార్తికేయ 2’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 13)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది.

దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కార్తికేయ 2’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

‘కార్తికేయ 2’ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. నిఖిల్‌ బ్లాక్‌ బస్టర్‌ కొట్టేశాడని చెబుతున్నారు. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

కార్తికేయ 2 ఓవరాల్‌గా బాగుంది. స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్‌ సాగుతుందని, థ్రిల్‌ ఫ్యాక్టర్‌ తక్కువగా ఉన్నప్పటికీ  టీమ్‌ మొత్తం మంచి ప్రయత్నం చేశారని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌ బాగుందని, కాలభైరవ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇరగదీశారని, అసలు కథ సెకండాఫ్‌ నుంచి మొదలు కాబోతుందని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ చాలా బాగుందని చెబుతున్నారు. చందూ మొండేటి కథ హ్యండిల్‌ చేసిన విధానం బాగుందని అంటున్నారు. విజువల్స్, గ్రిప్పింగ్ నేరేషన్ థ్రిల్లింగ్‌కు గురిచేస్తాయని కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు