‘చావు కబురు చల్లగా’  శివర్రాతి గిఫ్ట్‌ వచ్చేసింది

11 Mar, 2021 11:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టాలీవుడ్‌ కుర్ర హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా' మూవీ టీం శివరాత్రి గిఫ్ట్ ఇచ్చేసింది. ఈ సినిమాలోని నాలుగోపాటను  గురువారం  రిలీజ్‌  చేసింది. బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమాకి సంభిందించి ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.  బిగ్‌ బాస్‌ విన్నర్‌ రాహుల్  సిప్లిగంజ్‌ తనదైన స్టయిల్లో ఆలపించిన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, మూడు పాటలు ఈ  సినిమాపై భారీ హైప్‌నే క్రియేట్‌ చేశాయి. (ఏం సక్కగున్నావ్‌రో.. అందరి కళ్లు బన్నీ పైనే!)

కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ,  శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు