Kashmir Files: నిజ సంఘటనల ఆధారంగా ‘కశ్మీర్‌ ఫైల్స్‌’

10 Mar, 2022 08:16 IST|Sakshi

‘‘కశ్మీర్‌లో 1990వ దశకంలో హిందూ పండితులను టార్గెట్‌ చేసి టెర్రరిస్టులు ఊచకోత కోశారు. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో చూపించాం. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి అన్నారు. దర్శన్‌ కుమార్, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్‌ మాండ్లేకర్, ప్రకాష్‌ బెలవాడి, పునీత్‌ ఇస్సార్‌ నటించిన చిత్రం ‘కశ్మీర్‌ ఫైల్స్‌’. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వివేక్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ..‘‘కశ్మీర్‌లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను’’ అన్నారు. ‘‘గడచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అన్నారు అభిషేక్‌ అగర్వాల్‌. ‘‘మాపై నమ్మకంతో సినిమా విడుదలకు సహకరిస్తున్న తేజ్‌ నారాయణ్, అభిషేక్‌లకు థ్యాంక్స్‌’’ అన్నారు పల్లవి జోషి. నటుడు దర్శన్‌ కుమార్, బీజేపీ నాయకుడు రామచంద్రరావు, పరిపూర్ణానంద స్వామి తదితరులు మాట్లాడారు. 

మరిన్ని వార్తలు