యాక్టింగ్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా అజిత్‌ ‘ఆసై’ రీమేక్‌ మూవీ

23 Sep, 2022 15:25 IST|Sakshi
ఆశై చిత్రంలో ఓ సన్నివేశం

యాక్టింగ్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా ఆశై ఉంటుందని దర్శకుడు శివ్‌ మోహా పేర్కొన్నారు. ఇంతకు ముందు హీరో చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఆశై. ఈగల్‌ ఐ ప్రొడక్షన్స్‌ పతాకంపై రమేష్‌ పిళ్లయ్, సుధన్‌ సుందరం, జి జయరామ్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు కదిర్, దివ్యభారతి జంటగా నటించారు. సింధుబాద్‌ చిత్రం ఫేమ్‌ లింగా ఇందులో విలన్‌ పాత్రలో నటించగా ఆయనకు జంటగా నటి పూర్ణ నటించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటుందని నిర్మాతలు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిన్న ఆశ ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందన్నదే ప్రధానాంశమన్నారు. అందుకే దీనికి ఆశై అని టైటిల్‌ నిర్ణయించినట్లు చెప్పారు. ఈ టైటిల్‌ అంటే తనకు చాలా ఇష్టమని, కారణం తాను నటుడు అజిత్‌ అభిమానిని చెప్పారు. ఇదే పేరుతో ఇంతకుముందు అజిత్‌ నటించిన చిత్రం వచ్చిందని, నిర్మించిన ఆలయ పిక్చర్స్‌ సంస్థ నుంచి ఆ టైటిల్‌ అధికారికంగా పొందినట్లు తెలిపారు.

అందులో నటుడు ప్రకాష్‌ రాజ్‌ నెగటివ్‌ పాత్రలో హీరో హీరోయిన్లను ఎలా టార్చర్‌ చేస్తారో, ఈ చిత్రంలోని విలన్‌ ఒక రాత్రంతా హీరో హీరోయిన్లను టార్చర్‌ పెడతారన్నారు. అలా కొన్ని సిమిలారిటీస్‌ ఉన్నాయన్నారు. ఇది రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో సాగే యాక్టింగ్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం గా ఉంటుందని తెలిపారు. చిత్ర హైలెట్స్‌ క్‌లైమాక్స్‌ అన్నారు. చిత్రం షూటింగ్‌ చెన్నై పరిసర ప్రాంతాల్లో 25 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్ర ఆడియో ట్రైలర్‌ విడుదల ఎప్పుడు అన్నది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఆశై చిత్రంలో ఓ సన్నివేశం

మరిన్ని వార్తలు