Katrina Kaif: కత్రీనా కారు ఆపిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. తర్వాత ?

8 Dec, 2021 08:36 IST|Sakshi

Katrina Kaif Car Stopped By Traffic Police In Mumbai: బీటౌన్‌లో అత్యంత ట్రెండింగ్‌ టాపిక్‌ విక్కీ కౌశల్‌, కత్రీనా కైఫ్‌ వివాహం. డిసెంబర్‌ 7 నుంచి 10 వరకు వారి వివాహం జరగనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌. మంగళవారం సంగీత్‌, తర్వాత మెహందీ, అనంతరం 9న విక్కీ, కత్రీనాల వివాహం కానుండగా, 10న రిసెప్షన్‌ జరగనుందని సమాచారం. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అధికారికంగా ఎప్పుడూ ప్రకటిస్తారా.. అని అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఆ సమయంలో డిసెంబర్‌ 5న కత్రీనా, విక్కీ సాధారణంగా ముంబై రోడ్లపై దర్శనమిచ్చారు. జిమ్‌కు కలిసి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కత్రీనాకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. 

ఒక వీడియోలో కత్రీనా కారును ట్రాఫిక్‌ పోలీసు ఆపి, తనిఖీ చేయడానికి ముందుకు వస్తాడు. డ్రైవింగ్‌ సీటు దగ్గరికి వస్తూ కిటికిలోంచి లోపలికి చూస్తాడు. ఒక్కసారిగా కత్రీనా చూసి షాక్‌ అయిన పోలీసు డ్రైవర్‌తో మాట్లాడి ఓకే చేసి కారు పంపిస్తాడు. అయితే కత్రీనా పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు కారు తనిఖీ చేయడాన్ని చూసి జనం చాలా ఎంజాయ్‌ చేశారు. ఆ వీడియోపై కూడా నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. కత్రీనా, విక్కీ కౌశల్‌ పెళ్లి  గురించి సరదాగా కామెంట్స్‌ చేస్తూ, వివాహ కబురు త్వరగా చెప్పాలని కోరారు. 

అలాగే మరొక వీడియోలో ఓ అభిమానితో కత్రీనా సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. అభిమాని కోరిక మేరకు క‍్యాట్‌ ఏమాత్రం వెనుకాడకుండా సెల్ఫీ దిగడాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఆమె మంచి స్వభావాన్ని తెగ ఇష్టపడుతూ.. 'అందమైన మనసున్న వధువు' అని ఓ నెటిజన్‌ ప్రశంసించాడు. 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్‌ కోసం రూ. 100 కోట్లు ఆఫర్‌.. ఎందుకో తెలుసా ?

మరిన్ని వార్తలు