Katrina Kaif: కత్రినా క్రేజ్ మామూలుగా లేదుగా.. ఆ లిస్ట్‌లో ఆమెనే టాప్!

27 Sep, 2023 18:13 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో  భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్‌స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇ‍క్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్‌లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్‌బుక్ దిగ్గజం మార్క్ జుకర్‌ బర్గ్‌, ప్రముఖ రాపర్ బ్యాడ్‌ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. 

(ఇది చదవండి: కత్రినా కైఫ్‌ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్‌ బాడీగార్డ్స్‌.. వీడియో వైరల్‌)

ఇప్పటివరకు వాట్సాప్‌ ఛానెల్‌కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్‌ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్‌ 13న వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించింది. కొత్త ఛానెల్‌కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్‌ టాప్‌లో ఉంది.

(ఇది చదవండి: సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ సందేశం వచ్చేసింది)

కత్రినా ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో కలిసి టైగర్‌-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా  ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్‌-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్‌ మేకర్స్‌ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు