ఇంటర్వెల్‌ లేని సినిమాలో కత్రినా కైఫ్‌

25 Feb, 2021 08:53 IST|Sakshi

‘మెర్రీ క్రిస్మస్‌’ అంటున్నారు కత్రినా కైఫ్‌. అప్పుడే క్రిస్మస్‌ ఏంటి? అంటే కత్రినా నటించనున్న  తాజా చిత్రానికి ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్‌ సేతుపతి హీరోగా, కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా ‘అంధా ధున్‌’ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని 90 నిమిషాల నిడివితో తెరకెక్కించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ఇంటర్వెల్‌ ఉండకపోవడం ఓ విశేషం. ఏప్రిల్‌లో పుణేలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.  30 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ‘మెర్రీ క్రిస్మస్‌’ను థియేటర్లోకి తీసుకురావాలనుకుంటోంది చిత్రబృందం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు