శరీరాన్ని కష్టపెట్టకండి

22 Sep, 2020 03:08 IST|Sakshi
కత్రినా కైఫ్‌

‘ఫిట్‌నెస్‌ అనేది మానసిక మరియు శారీరక ప్రయాణం. ఫిట్‌నెస్‌ కోసం చేసే వర్కవుట్స్‌ని ఆనందంగా చేయాలి కానీ ఏదో సాధించాలనే తాపత్రయంతో శరీరాన్ని ఇబ్బందిపెట్టకూడదు’’ అంటున్నారు కత్రినా కైఫ్‌. బాలీవుడ్‌లో ఫిట్‌గా ఉండే హీరోయిన్స్‌లో కత్రినా ఒకరు. పదిహేనేళ్ల క్రితం కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే కనిపిస్తున్నారామె. ఫిట్‌నెస్‌ గురించి తన ఆలోచనలు పంచుకుంటూ –‘‘ఫిట్‌నెస్‌లో ముఖ్యమైన విషయం బ్యాలెన్స్‌. విపరీతంగా వర్కవుట్‌ చేస్తే నష్టమే. అందుకే బ్యాలెన్డ్స్‌గా ఉండాలి.

జాగింగ్‌ అయినా రన్నింగ్‌ అయినా ఏ వ్యాయామం అయినా ఆస్వాదిస్తూ చేయాలి. క్రమం తప్పని పద్ధతిని ఫాలో అవ్వాలి. మనం ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ చేసినప్పుడు ఏదీ కష్టం కాదు. అలాగే తమ శరీరాకృతిని మార్చుకోవడానికి కొందరు శరీరాన్ని బాగా కష్టపెడతారు. అది మంచిది కాదు. సినిమా స్టార్స్‌ అంటే ఫిట్‌గా కనిపించాలి, క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి.. మనకెందుకు? అని కొంతమంది అనుకుంటారు. అయితే మనం చేస్తున్న వృత్తికి, ఫిట్‌నెస్‌కి సంబంధం లేదు. మనం ఏ వృత్తిలో ఉన్నా ఫిట్‌గా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి’’ అన్నారు కత్రినా కైఫ్‌.

మరిన్ని వార్తలు