అలా వైకుంఠపురంలోకి.. కేటి దంపతులు

21 Oct, 2020 20:07 IST|Sakshi

కాలిఫోర్నియా: కేటి పెర్రీ, ఓర్లాండో బ్లూమ్‌ దంపతులు ఇటీవల కాలిఫోర్నియాలోని మాంటెసిటీలో అత్యంత ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. కుబేరులు నివసించే ప్రాంతంలోనే వారో భవనాన్ని 14.2 మిలియన్‌ డాలర్లకు (దాదాపు 105 కోట్ల రూపాయలు) కొనుగోలు చేశారు. చుట్టూ పచ్చని కొండలు, లోయలు ఓ పక్కన సముద్ర తీరం మరో పక్కన కనిపించేంత దూరంలో సుందర వనం, స్విమ్మింగ్‌ కలిగిన విలాసవంతమైన భవనాన్ని డ్యూరాసెల్‌ మాజీ సీఈవో సీ. రాబర్ట్‌ కిడ్డర్‌ నుంచి కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కిడ్డర్‌ 20 ఏళ్ల పాటు ఆ భవనంలో ఉన్నారు. ప్రిన్స్‌ హారి, మేఘన్‌ మార్కెలే కొనుగోసిన విలాస భవనానికి సమీపంలోనే పెర్రీ దంపతులు ఈ భవనాన్ని కొనుగోలు చేయడం విశేషం.

అమెరికా పాప్‌ సింగర్‌గా, గేయ రచయితగా ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకొంటున్న కేటి పెర్రీ, ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్, పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌ సీరియల్‌ చిత్రాల ద్వారా హాలివుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓర్లాండో బ్లూమ్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటూ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. గత ఆగస్టు నెలలోనే వారికి జన్మించిన పాపకు వారు డైజీ డోవ్‌ అని పేరు పెట్టారు. రెండు పడక గదులు, రెండు బాత్‌ రూమ్‌లు కిచెన్,  డైనింగ్, లైబ్రరీ, సిట్టింగ్‌ హాళ్లతో పాటు ఇంటి చుట్టూ విస్తరించిన ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని సేదతీరేందుకు ఎన్నో సిట్‌ అవుట్లు ఉన్నాయి. నౌకర్లు, చాకర్లను పక్కన పెడితే ఆ విలాస భవనంలో వారండేది ముగ్గురే. (చదవండి: మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న జాన్‌సేన‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా