కౌన్ బనేగా కరోడ్‌పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!

2 Apr, 2022 16:51 IST|Sakshi

కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) అభిమానులకు గుడ్‌న్యూస్‌. కేబీసీ 14వ సీజన్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది  ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. 

అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు  తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్‌: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?)

కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్‌ లిస్ట్‌ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసు​కోవచ్చు. (క్లిక్‌: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు)

మరిన్ని వార్తలు