బిగ్‌బాస్‌: కౌశల్‌కు కరోనా భయం, ఏం జరిగిందంటే!

26 Apr, 2021 21:34 IST|Sakshi

ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ ధాటికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతంగా పెరిగిపోతోంది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో సైతం కరోనా కోరలు చాస్తోంది. దీంతో  పలు షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే 50 మందికి మించకుండ షూటింగ్‌ నిర్వహించాలనే నిబంధనల మేరకు కొందరు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు జరుపుకుంటున్నారు. 

అయినప్పటికి నటీనటులు ఇతర చిత్ర బృందంలోని వ్యక్తులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో మిగతా వారంత కరోనా పట్ల ఆందోళన చెందుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ 2 సీజన్‌ విన్నర్‌ కౌశల్‌కు సైతం కరోనా భయం పట్టుకుంది. దీంతో అతడు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా తెలినట్లు వెల్లడించాడు. 

కాగా ప్రస్తుతం కౌశల్ సినిమాల కంటే ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్ మోడలింగ్‌లో దూసుకుపోతున్నాడు. దీంతో అతడు నెల రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉంటున్నాడట. ఈ క్రమంలో తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని దీంతో కౌశల్‌ ఇంటి దారి పట్టక తప్పలేదు. ఇక నెల రోజుల తర్వాత భార్య పిల్లలను కలుస్తుండటంతో అతడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని, ఎప్పుడైనా ముందు జాగ్రత్త పడటం మంచిదే అని సూచించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda)

చదవండి: 
బిగ్‌బాస్‌: లైవ్‌లో రెమ్యూనరేషన్‌ బయట పెట్టిన కంటెస్టెంట్‌ 
టాలీవుడ్‌లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి
పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం

మరిన్ని వార్తలు