20 ఏళ్ల ప్రయత్నం.. కోటీశ్వరులు అయ్యారు

26 Nov, 2020 15:46 IST|Sakshi

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’తో సత్తా చాటిన మహిళలు

కలను నిజం చేసుకున్న మహిళామణులు

 కోటీశ్వరులైన నసీమ్‌, అనుపదాస్‌, తస్లీమ్‌

కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. సింపుల్‌గా చెప్పాలంటే కేబీసీ.. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైనా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ షోకు విపరీతమైన క్రేజ్‌. దాదాపు కొన్ని లక్షల మంది 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. కానీ కొందరు అదృష్టవంతులు మాత్రమే హాట్‌ సీటు వరకు చేరుకుంటారు. ఇక కేబీసీ సీజన్‌ 12 నెల రోజుల క్రితం ప్రారంభమయ్యింది. అయితే ఈ సీజన్‌కు, మిగతా సీజన్‌లకు మధ్య ఓ తేడా ఉంది. ఈ సీజన్‌ ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళలు కోటీశ్వరులుగా నిలిచారు. మరో విశేషం ఏంటంటే వీరంతా కేబీసీ ప్రారంభమైన నాటి నుంచి అంటే 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత అవకాశం రావడం.. కోటీశ్వరులుగా మారడం నిజంగా గ్రేటే. ఇక ఈ సీజనల్‌లో ఇప్పటి వరకు కోటీశ్వరులుగా నిలిచిన ఆ ముగ్గురు మహిళలు ఎవరంటే నాజియా నజీమ్‌, రెండవ కోటీశ్వరురాలు మోహితా శర్మ, మూడవ కోటీశ్వరురాలు అనుప దాస్‌. ఇక ఈ ముగ్గురు కోటీశ్వరుల గురించి క్లుప్తంగా ఓ సారి చూద్దాం.

మొదటి కోటీశ్వరురాలు నాజియా నసీమ్‌
కేజీబీ సీజన్‌ 12లో తొలి కోటీశ్వరురాలు నాజియా నసీమ్‌. ఢిల్లీకి చెందిన నాజియా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలో కమ్యూనికేషన్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కేబీసీలో పాల్గొన్న ఆమె ఈ నెల 11న సీజన్‌లో తొలి కోటీశ్వరురాలిగా నిలిచారు. ఇక ఆమె ఆట తీరును బిగ్‌ బీ సైతం ఎంతో ప్రశంసించారు. 

రెండవ కోటీశ్వరురాలు మోహితా శర్మ
కేబీసీ సీజన్‌లో 12లో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి మోహితా శర్మ రెండవ కోటీశ్వరురాలిగా నిలిచారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఏఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్న మోహితా కేబీసీ 12లో రెండో కోటీశ్వరురాలిగా నిలిచారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మోహిత భర్త గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అదృష్టం ఆయన భార్యని వరించింది. (చదవండి: ‘ఇప్పటికి నా భార్యకి లవ్‌ లెటర్స్‌ రాస్తాను)

మూడవ కోటీశ్వరురాలు అనుపదాస్‌
ఇక చత్తీస్‌గఢ్‌కు చెందిన స్కూల్‌ టీచర్‌ అనుపదాస్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోటీ రూపాయలు గెలుచుకున్న మూడవ మహిళగా నిలిచారు. నిన్నటి ఎపిసోడ్‌లో అనుప దాస్‌ ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యి కోటి రూపాయలతో కోటీశ్వరురాలిగా నిలిచారు. ఈమె కూడా గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆమెపై ప్రశంసలు కురిపించారు. చాలా బాగా ఆడారని మెచ్చుకున్నారు. వీరు ముగ్గురు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కోటి రూపాయలు గెలుచుకున్న మహిళలుగా నిలిచారు.

కేబీసీలో తొలి కోటేశ్వరురాలు ఎవరంటే
కేబీసీ 12 సీజన్‌లలో మొదటి సారి కోటీశ్వరురాలిగా నిలిచిన మహిళ ఎవరంటే రహత్‌ తస్లీమ్‌. 2010లో కోటి రూపాయలు గెలుచుకున్నారు. కేబీసీలో అప్పటి వరకు ఏ మహిళ కూడా కోటి రూపాయలు గెలుచుకోలేదు. రహత్‌ తస్లీమ్‌ మెడిసిన్‌ చదవాలని భావించారు. కానీ చిన్న వయసులోనే వివాహం కావడంతో ఆ కోరిక తీరలేదు. ఇక కేబీసీలో గెలిచిన సొమ్ముతో ఆమె తన కలను నేరవేర్చుకుంటానని తెలిపారు. (చదవండి: 7 కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు ఇదే?)

రూ.5 కోట్లు గెలిచిన మహిళ ఎవరంటే..
 సన్‌మిత్‌ కౌర్‌ కేబీసీ చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదు కోట్లు రూపాయలు గెలిచిన మహిళగా రికార్డు సృష్టించారు. ఆరవ సీజన్‌లో సన్‌మిత్‌ ఈ రికార్డు సృష్టించారు. ముంబైకి చెందిన సన్‌మిత్‌ తన కుమార్తె ప్రొత్సాహం వల్ల దీనిలో పాల్గొన్నానని తెలిపారు. 

కేబీసీలో కోటి గెలిచిన ఇతర మహిళలు ఎవరంటే..
ఫిరోజ్ ఫాతిమా: కేబీసీ సీజన్ 7 లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళా పోటీదారుగా ఫిరోజ్‌ ఫాతిమా నిలిచారు. ఫిరోజ్ తన తండ్రి చికిత్స కోసం ఆమె కుటుంబం తీసుకున్న రుణాన్ని చెల్లించడానికిగాను దీన్ని వినియోగిస్తానని తెలిపారు.

అనామికా మజుందార్: జంషెడ్‌పూర్‌లో ఎన్జీఓను నిర్వహిస్తున్న ఒక సామాజిక కార్యకర్త, అనామికా కేబీసీ తొమ్మిదవ సీజన్‌లో కోటిశ్వరురాలు అయ్యారు. పోటీలో గెలిచేందుకు ఆమె తన కొడుకుతో కలిసి చదువుకునేదాన్నని తెలిపారు. (కేబీసీ : ఈ సీజన్‌లో ఇదే తొలిసారి)

బినిత జైన్: జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన బినిత జైన్‌ తన పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వడానికి కేబీసీకి వచ్చినట్లు తెలిపారు. 10వ సీజన్‌లో ఆమె కోటి రూపాయలు గెలుచుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఆమెని గొప్ప సింగిల్ పేరెంట్ అని  ప్రశంసించారు.

బబితా తడే: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన బబితా, కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 11 లో కోటీశ్వరురాలు అయ్యారు. వృత్తిరీత్యా మధ్యాహ్నం భోజనం వండే బబిత పాఠశాల విద్యార్థులకు కిచిడీ తయారు చేయడం ద్వారా నెలకు 1,500 రూపాయలు సంపాదించేవారు. ఆమె అంకితభావానికి హోస్ట్ అమితాబ్ బచ్చన్ ముచ్చటపడ్డారు

మరిన్ని వార్తలు