కేబీసీ 13: రూ. 7 కోట్ల ప్రశ్న, గెలుస్తాడా, లేదా?!

19 Oct, 2021 17:56 IST|Sakshi

Kaun Banega Crorepati Latest Promo: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన టీవీ షోల్లో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఒకటి. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం 13వ సీజన్‌ను జరపుకుంటోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సీజన్లో కంటెస్టెంట్స్‌ ఆశ్చర్యకరంగా కోట్లు గెలుచుకుంటున్నారు. ఈ షో రూ. కోటి సొంతం చేసుకున్న తొలి కంటెస్టెంట్‌గా హిమానీ బుందేలా నిలిచిన సంగతి తెలిసిందే.  కళ్లు సరిగా కనిపించకపోయినా ఆమె విజేతగా నిలిచి ఎందురికో స్ఫూర్తినిచ్చారు. ఈ నేపథ్యంలో మరో కంటెస్టెంట్‌ కూడా కోటీశ్వరుడు అయినట్లు నేడు(మంగళవారం) విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.

చదవండి: షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పా దంపతులు

అయితే సదరు కంటెస్టెంట్‌ రూ. కోటితో ఆగిపోకుండా రూ. 7 కోట్ల ప్రశ్నకి చేరుకున్నాడు. అక్టోబరు 20, 21 తేదీల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు రిలీజ్‌ చేశారు. ఇందులో హాట్‌సీట్‌లో ఉన్న అమితాబ్‌ రూ.కోటి ప్రశ్న అడగ్గా సదరు కంటెస్టెంట్‌ ఆప్షన్‌ డిని ఎంపిచేసుకున్నాడు. అది సరైన సమాధానమా, కాదా? అనే ఉత్కంఠకు తెరదించుతూ అమితాబ్‌ ‘ఏక్‌ కరోడ్‌’ అని ఖరారు చేశారు. దాంతో షోలో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఆ తర్వాత ఆట ఇంకా పూర్తవలేదు అంటూ రూ. 7 కోట్ల ప్రశ్నని సంధించారు అమితాబ్‌. మరి ఆ కంటెస్టెంట్‌ రూ. 7 కోట్లు గెలుస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  

చదవండి: పాన్‌ మసాలా యాడ్‌ నుంచి వైదొలిగిన అమితాబ్‌

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

మరిన్ని వార్తలు