కోటి గెలుచుకున్న కవిత చావ్లా.. కానీ, క్రికెట్‌పై ప్రశ్నకు సమాధానం చెప్పలేక రూ. 7.5 కోట్లు!

21 Sep, 2022 14:37 IST|Sakshi

కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియల్టీ గేమ్‌ షో దేశవ్యాప్తంగా  అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. ఇదే షో తెలుగులో మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిందీ వెర్షన్‌ కేబీసీ సీజన్‌ 14 నడుస్తోంది. ఇందులో బిగ్ బి తన చురుకైన మాటలతో షోకే హైలైట్‌గా నిలుస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా వినోదాన్ని అందిస్తున్నాడు.

ఈ సీజన్‌లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గృహిణి కవితా చావ్లా మొదటి కోటి రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చివరికి రూ.7.5 కోట్లు ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు.  ఆత్మవిశ్వాసంతో ఈ గేమ్ ఆడిన కవిత ప్రేక్షకులతో పాటు హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకుంది. 

ఏంటి ఆ ప్రశ్న..
అప్పటికే కోటి గెలిచిన ఉత్సాహంతో కవిత ఈ గేమ్‌లో ముందుకు అడుగువేశారు. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్నగా రానే వచ్చింది. ఆ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు, దీంతో నరాలు తెగేంత ఉత్కంఠ ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? ఆఫ్షన్లు ఇవే.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర.  మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు సమాధానం కోసం ఆలోచించింది. కానీ జవాబుపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తన సమాధానంగా A ఎంపికను లాక్ చేశారు. అయితే, సరైన సమాధానం ఎంపిక B అని తేలింది.

దీంతో తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఊపిరి పీల్చుకు​న్నారు. గతంలో కూడా కవిత కేబీసీ షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ప్రస్తుతం పట్టుదలతో షోలో పాల్గొనడంతో పాటు కోటి గెలిచి సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది. 

చదవండి: Samantha: స్కిన్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్‌ ఏం చెప్పారంటే..

మరిన్ని వార్తలు