పడ్డారండి పనిలో మరి...

22 Sep, 2020 02:39 IST|Sakshi

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి. ‘బ్యాక్‌ టు వర్క్‌’  అంటూ ఆయన చేస్తున్న సినిమాల గురించి ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రస్తుతం నేను రెండు సినిమాలకు సంగీతం సమకూర్చే పనిలో ఉన్నాను. ఒకటి దర్శకుడు క్రిష్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా. మరొకటి దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్నది. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి’’ అన్నారు. అన్నట్లు.. కీరవాణి అందించిన హిట్‌ సాంగ్స్‌లో ‘పడ్డానండి ప్రేమలో మరి..’ ఒకటి. ఇప్పుడు ఆయన ‘బ్యాక్‌ టు వర్క్‌’ అంటున్నారు కాబట్టి ‘పడ్డారండి పనిలో మరి..’ అనొచ్చు.

మరిన్ని వార్తలు