రూటు మార్చిన కీర్తి సురేష్‌.. గ్లామర్‌ డోస్‌ పెంచేసిందిగా!

22 Aug, 2022 09:31 IST|Sakshi

ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌కు తొలి ఆప్షన్‌గా కీర్తి సురేష్‌ పేర్కొనేవారు. మహానటి వంటి చిత్రాలు ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. తర్వాత అతికొద్ది కాలంలోనే హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి శభాష్‌ అనిపించుకుంది. అదేవిధంగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. దీంతో చాలామంది హీరోయిన్ల మాదిరిగా కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంచుకొని నటిస్తుందనే ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి ఈ భామ తాజాగా గ్లామర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఆ మధ్య బాగా వర్కౌట్‌ చేసి బక్కచిక్కిన కీర్తి సురేష్‌ ముఖంలో గ్లో పోవడంతో విమర్శలను ఎదుర్కొంది. అయితే ఈమధ్య తెలుగులో మహేష్‌ బాబుతో నటించిన సర్కారు వారి పాట చిత్రంలో అందాలను మెరుగు పరుచుకుని ఆకట్టుకుంది. కాగా తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్ల తరహాలో మాస్‌ లుక్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడంతో ప్రస్తతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంటోంది. మలయాళంలో ఒక చిత్రం, తెలుగులో జానీతో దసరా, చిరంజీవికి చెల్లిగా భోళాశంకర్‌ చిత్రాలతో పాటూ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ సరసన మామన్నన్‌ చిత్రం చేస్తోంది.

మరిన్ని వార్తలు