‘చాలా రోజుల తర్వాత మీ నవ్వు చూస్తున్నాం’

9 Jan, 2021 16:56 IST|Sakshi

కీర్తీ సురేశ్‌ లేటెస్ట్‌ షూట్‌.. అభిమానులు ఫిదా!

కొత్త ఏడాది ప్రారంభంలోనే క్యూట్‌ క్యూట్‌ ఫొటోలతో కీర్తి సురేశ్ అభిమానులను ఫిదా​ చేశారు. 2021 తొలి ఫొటోషూట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘మహానటి’ షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన పెంపుడు కుక్కతో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె బుమారాంగ్‌లో పంచుకున్నారు. డిజైనర్‌ అర్చామెహతా, హేర్‌, మేకప్‌ స్టైలిస్ట్‌ రేచెల్‌లను ట్యాగ్‌ చేశారు. అంతేగాక వారితో కలిసి సరదాగా కెమెరాకు ఫొజులిస్తున్న ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు. ‘చాలా రోజుల తర్వాత మీ నవ్వు చూస్తున్నాము’, చాలా అందంగా ఉన్నారు’ అంటూ అభిమానులు హర్ట్‌ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పెళ్లి చేసుకోవాలంటూ కీర్తి పేరేంట్స్‌ ఒత్తిడి ?)

కాగా కీర్తి ‘గీతా గోవిందం’‌ ఫేం ప‌ర‌శురామ్ తెర‌కెక్కించనున్న ‘స‌ర్కారు వారి పాట’లో సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు సరసన కీర్తి నటించనున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఆమె వెంకీ అట్లూరి రూపొందిస్తున్న రంగ్‌దేలో నితిన్ సరసన న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్‌ మార్చి 26న ‘రంగ్‌దే’ విడుదలకానుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌. దీనితో పాటు జాతీయ అవార్డు గ్ర‌హీత న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి న‌టించిన ‘గుడ్ ల‌క్ స‌ఖి’ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ‘మ‌ర‌క్క‌ర్’ కీర్తీ కీలక పాత్ర పోషిస్తోంది. (చదవండి: ద‌ర్శ‌కుడి వెంట‌ప‌డి చిత‌క‌బాదిన హీరోయిన్‌)

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

మరిన్ని వార్తలు