ద‌ర్శ‌కుడి వెంట‌ప‌డి చిత‌క‌బాదిన హీరోయిన్‌

3 Dec, 2020 16:30 IST|Sakshi

నితిన్‌, కీర్తి సురేశ్‌ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'రంగ్ ‌దే'. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. కోవిడ్ బ్రేక్ త‌ర్వాత ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. కొన్ని పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ దుబాయ్‌కి వెళ్లింది. ఈ క్ర‌మంలో సినిమా సెట్లో 'మ‌హాన‌టి' కీర్తి సురేశ్ కాసేపు కునుకు తీస్తుండ‌గా డైరెక్ట‌ర్ వెంకీతో క‌లిసి నితిన్ ఆమె వెన‌కాల చేరి సెల్ఫీ దిగారు. అనంత‌రం దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో త‌మ‌కు చెమ‌ట‌లు ప‌డుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంద‌ని నితిన్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. (చ‌ద‌వండి: సన్నీ డియోల్‌కు కరోనా)

ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ కాగా కీర్తి సైతం స్పందించారు. షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్ర‌పోకూడ‌ద‌న్న గుణ‌పాఠం నేర్చుకున్నానని, కానీ డైరెక్ట‌ర్‌, హీరోపై మాత్రం ప‌గ తీర్చుకుంటానని శ‌ప‌థం చేశారు. అన్న‌ట్లుగానే ఆమె ఈ ఇద్ద‌రిలో ఒక‌రిపై తొంద‌ర‌గానే ప‌గ తీర్చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. చేతికి ఓ గొడుగు దొర‌క‌డంతో వెంకీ అట్లూరిని కీర్తి చిత‌క‌బాదారు. ఆయ‌న‌ను ప‌రిగెత్తించి మ‌రీ కొట్టారు. అయితే అదంతా స‌ర‌దాగానే చేశారు. ఇక నితిన్ ఒక్క‌డే మిగిలాడ‌ని, అత‌నిపై ప్ర‌తీకారం తీర్చుకుంటే కానీ త‌న ప‌గ చ‌ల్లారదంటున్నారు. చూస్తుంటే నితిన్ కూడా ఏదో ఒక రోజు ఆమె చేతిలో అడ్డంగా దొరికిపోతాడ‌ని అనిపిస్తోంది. కాగా రంగ్ దే సినిమాను చిత్ర‌బృందం సంక్రాంతికి విడుద‌ల చేయాలని భావిస్తోంది. (చ‌ద‌వండి: భాష లేని ఊసులాట!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు