HBD Keerthy Suresh : కీర్తి సురేశ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన 'భోళా శంకర్‌' టీం

17 Oct, 2021 10:46 IST|Sakshi

Happy Birthday Keerthy Suresh : మెగాస్టార్‌ చిరంజీవి మెహ‌ర్ ర‌మేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌హిట్‌ 'వేదాళం' చిత్రానికి రీమేక్‌ ఇది. ఇక ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటిస్తుంది.

ఆదివారం(అక్టోబర్‌17)న కీర్తి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు బర్త్‌డే విషెన్‌ను తెలిపింది. 'నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, టాలెంటెడ్‌ కీర్తిసురేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ తెలుగులో భోళా శంకర్‌, సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు