-

Keerthy Suresh: అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా

14 May, 2022 11:35 IST|Sakshi

Keerthy Suresh Clarifies Why She Accepts Sister Roles: ‘నేను.. శైలజ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌. ఆ తర్వాత లెజెండరి నటి సావిత్రి బయోపిక్‌లో నటించే చాన్స్‌ కొట్టేసింది. ‘మహానటి’లో సావిత్ర పాత్ర పోషించిన కీర్తి ఆ రోల్‌కు వందశాతం న్యాయం చేసింది. అంతేకాదు ఈమూవీకి గాను ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డును కూడా అందుకుంది కీర్తి. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు కీర్తికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టేలేదు.

చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి

లేడీ ఓరియంటేడ్‌ సినిమాలైన ‘గుడ్‌లక్‌ సఖీ’, ‘పెగ్విన్‌’, ‘చిన్ని’లు డిజాస్టర్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఆమె ‘సర్కారు వారి పాట’ మూవీతో అలరించింది. ఇందులో మహేశ్‌ బబు సరసన నటించిన కీర్తి ఈ మూవీ సక్సెస్‌ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు చెల్లెలి పాత్రలు చేయడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనిపై కీర్తి స్పందిస్తూ.. ‘మంచి పాత్రలను వదులుకోవడం ఇష్టం లేదు. ప్రస్తుతం ఉన్నట్లు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పాత్రలు వస్తాయే రావో చెప్పలేం.

చదవండి: Siri-Shrihan: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు

అందుకే నా దగ్గరికి వచ్చిన బెస్ట్‌ రోల్స్‌ అన్నింటికి ఒకే చెబుతున్న. ఇక రజనీకాంత్‌ లాంటి సూపర్‌ స్టార్‌ పక్కన చాన్స్‌ రావడం చాలా కష్టం. అలాంటి అవకావం వస్తే వదులుకోవద్దు. అందుకే అన్నాత్తైలో(తెలుగులో పెద్దన్న) ఆయన చెల్లెలిగా నటించాను. అలాగే చిరంజీవి లాంటి స్టార్‌ హీరోతో కూడా కలిసి నటించే అవకాశం రాదు. అందుకే భోళా శంకర్‌లో ఆయనకు చెల్లిగా చేసేందుకు ఒప్పుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ బట్టి కూడా తాను ఈ రోల్స్‌ చేస్తున్నట్టు ఆమె తెలిపింది. కాగా సర్కారు వారి పాటలో కళావతిగా కీర్తి మాస్‌గా, గ్లామరస్‌ కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది.

మరిన్ని వార్తలు