కీర్తి సురేశ్ చేసుకోబోయే వరుడు అతనేనా.. ఫోటో వైరల్!

17 May, 2023 07:34 IST|Sakshi

అమ్మ మేనక నటి, నాన్న సురేష్‌ నిర్మాత. వారి వారసురాలు కీర్తి సురేష్‌. ఒక నటిగా ఈమెకు ఇంకేం అర్హతలు కావాలి. అందుకే అనతి కాలంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. మొదట్లో మాలీవుడ్‌లో నటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె.. ఆ తరువాత తమిళంలో ఇదు ఎన్న మాయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా రెండవ చిత్రం రజనీ మురుగన్‌ కీర్తి సురేష్‌కి పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఆ తరువాత ఆమె నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 

(ఇది చదవండి: 'మిర్చి' హీరోయిన్‌ ఇప్పుడెలా ఉంది? భర్త,కొడుకును చూశారా?)

టాలీవుడ్‌లో మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి అందరి ప్రశంసలను అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో గ్లామర్‌ పాత్రలు పోషించినా ఇటీవల తెలుగు చిత్రం దసరాలో డిగ్రామర్‌ పాత్రలో నటించి.. మరోసారి తన సత్తాను చాటుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా భోళా శంకర్‌ చిత్రంలో నటిస్తోంది.

తమిళంలో అరడజను చిత్రాల వరకు ప్రస్తుతం కీర్తి సురేష్‌ చేతిలో ఉన్నాయి. అందులో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో నటించిన మామన్నన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా జయం రవి సరసన నటిస్తున్న సైరన్‌ చిత్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రం రివాల్వర్‌ రిటా చిత్రం, రఘు తాత చిత్రాలు నటిస్తోంది.

(ఇది చదవండి: ప్రెగ్నెన్సీ గురించి ఊహించని విషయం చెప్పిన ఉపాసన!

ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేశ్‌ పెళ్లి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌అవుతున్నాయి. 30 ఏళ్ల పరువాల ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందనే ప్రచారం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కీర్తిసురేష్‌ ఓ వ్యక్తితో షికారు చేస్తోంది. అతని పేరు పర్హాన బీన్‌ లియాకత్‌ అని, అతను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అని సమాచారం. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా నటి కీర్తిసురేశ్ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. దీంతో వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను వైరల్‌ చేస్తూ అతనేనా కీర్తి సురేష్‌ కాబోయే వరుడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు