ప్రభాస్‌ ‘ఆదిపురుష్’‌లో కీర్తి సురేష్‌!

20 Aug, 2020 12:44 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన 22వ చిత్రాన్ని 'తాన్హాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌తో చేయనున్న విషయం తెలిసిందే. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రావడంతో డార్లింగ్‌ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ సినిమాతో ప్రభాస్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టనున్నారు. పౌరాణికం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిలా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారమవుతోంది. 3డీ సినిమాలో రాముడి సరసన సీతాదేవి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ ప్రభాస్‌తో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. (‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ అదే!)

ప్యాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ సినిమా మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలకానుంది. అంతేగాక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు బీటౌన్ లో చర్చ జరుగుతోంది. ఓం రౌత్ తెరకెక్కించిన 'తానాజీ' చిత్రంలో కూడా సైఫ్ కీలక పాత్రను పోషించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే లవ్ స్టోరీ చేస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంపూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. ఈ తర్వాత ఓంరౌత్‌ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొననున్నాడు. (కీర్తీ సురేష్‌.. ‘గుడ్ ల‌క్ స‌ఖి’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు