మరో గ్రీన్‌ సిగ్నల్‌!

4 Jan, 2022 05:06 IST|Sakshi

తెలుగులో ‘బోళాశంకర్‌’, ‘సర్కారు వారి పాట’, తమిళంలో ‘సాని కాయిదమ్‌’, మలయాళంలో ‘వాషి’ .. ఇలా సౌత్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు హీరోయిన్‌ కీర్తీ సురేష్‌. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ టాక్‌. మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు