శ్రీదేవి చిత్ర సీక్వెల్‌లో కీర్తీసురేశ్‌?

6 Aug, 2020 07:34 IST|Sakshi

సినిమా: దివంగత నటి శ్రీదేవి నటించిన సూపర్‌హిట్‌ చిత్ర సీక్వెల్‌లో యువ నటి కీర్తీసురేశ్‌ నటించనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. నటుడు కమలహాసన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం సిగప్పు రోజాక్కళ్‌. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978లో విడుదల వసూళ్ల వర్షం కురిపింది. సైకో ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం ఇది. ఇదే చిత్రం హిందీలోనూ రాజేశ్‌ఖన్నా హీరోగా రూపొందింది. తెలుగులోనూ అనువాదమైంది. ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

కాగా సుమారు 42 ఏళ్ల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్‌ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీన్ని దర్శకుడు భారతీరాజానే సొంతంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలను ఒక యువతి ప్రతీకారం తీర్చుకునే కథగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు