నిర్మాతగా మారనున్న కీర్తి సురేష్‌!

1 Sep, 2020 08:39 IST|Sakshi

మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌  తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా బిజీగా వుంది. కీర్తి సురేష్‌ ఇప్పుడు మరో అవతారం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా మారి ఒక వెబ్‌ సిరీస్‌ను రూపొందించడానికి కీర్తి సిద్దమౌతోంది. కథ బాగా  నచ్చడంతో తమిళ వెబ్‌ సిరీస్‌ను నిర్మించాలని కీర్తి ఫిక్స్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది.   కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే. 

ఇక కీర్తి సినిమాల విషయానికి వస్తే మిస్‌ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమాలో కీర్తి, మహేష్‌ బాబు సరసన నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్‌తో చేస్తున్న షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోగా అది మొదలు కానుంది.  

చదవండి: ఆ లవ్‌ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్‌

మరిన్ని వార్తలు