అల్లు అర్జున్‌కి అరుదైన బహుమతి..160 ఏళ్ల పురాతన గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్‌

29 Sep, 2021 16:05 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కేరళలో బన్నీకి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అక్కడి అభిమానులు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాలకు కేరళలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ వస్తుంటాయి. బన్నీ కూడా కేరళ అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ కి ఓ కేరళ అభిమాని ఓ అరుదైన గిఫ్ట్ ని బహూకరించాడు.
(చదవండి: ఫుష్ప బిగ్‌ అప్‌డేట్‌: రష్మిక లుక్‌ అదిరిందిగా)

కేరళలో పుట్టి దుబాయ్‌లో సెటిలైన మల్టీ మిలియనీర్‌ రియాజ్‌ కిల్టన్‌కి బన్నీ అంటే ఎనలేని అభిమానం. తన అభిమాన హీరోని ఒక్కసారైనా నేరుగా కలవాలనుకున్నాడు కిల్టన్‌. షూటింగ్‌ నిమిత్తం ఇటీవల యూఏఈ వెళ్లిన బన్నీని కిల్టన్‌ కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్​కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్​ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ వీడియోని షేర్‌ చేశాడు.

అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదటి పార్ట్ ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్​తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీలో రష్మిక మందన్నా లుక్‌ కూడా విడుదలైంది. ఇందులో రష్మిక  గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు