మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ

30 Aug, 2022 13:28 IST|Sakshi

‘‘విభిన్నమైన వృత్తుల్లో (పాత్రల్లో) కనిపించగలిగే అవకాశం యాక్టర్స్‌కు మాత్రమే దక్కుతుంది. అందుకే నేను యాక్టర్‌ని అయినందుకు సంతోషంగా ఉంది. నా పేరెంట్స్, తాతగారు డాక్టర్స్‌. మా నాన్నగారు నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ నా ఇష్టం మేరకు నేను యాక్టర్‌ని అయ్యాను. అయితే ‘రంగ రంగ వైభవంగా..’ చిత్రంలో మెడికల్‌ స్టూడెంట్‌ రాధగా నటించాను. అలా స్క్రీన్‌పై డాక్టర్‌గా కనిపించాను. ఈ విధంగా మా నాన్నగారి కల నిజం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేతికా శర్మ.

వైష్ణవ్‌ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమా నాకో లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్సే.‘రొమాంటిక్‌’, ‘లక్ష్య’ చిత్రాలతో యూత్‌ ఆడియన్స్‌కు దగ్గరైన నేను ‘రంగరంగ వైభవంగా..’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర కానున్నందుకుసంతోషంగా ఉంది. ఇందులో నేను చేసిన రాధ పాత్రలో ప్రతి అమ్మాయి తనను తాను కొంచెం అయినా ఊహించుకుంటుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు