Kethika Sharma : సినిమా రిజల్ట్‌ నా చేతుల్లో ఉండదు.. నచ్చిన సినిమాలు చేస్తా'

10 Apr, 2023 16:23 IST|Sakshi

అందాల భామ కేతిక శర్మ రొమాంటిక్‌ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాష్‌ పూరీ నటించారు. తొలి సినిమాతోనే గ్లామరస్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కేతిక ఆందాల ఆరబోతలో అస్సలు మొహమాటపడదు. ఆమె చేసిన రొమాంటిక్‌, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు ఫ్లాప్‌ అయినా యూత్‌లో ఆమె క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

సక్సెస్‌ లేకపోయినా గ్లామర్‌తో అవకాశాలు కొల్లగొట్టేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన ఫెయిల్యూర్స్‌పై స్పందించింది. 'సినిమా కాన్సెప్ట్‌ నచ్చితే చేస్తాను. రిజల్ట్‌ గురించి ఆలోచించను. నా పాత్ర వరకు న్యాయం చేస్తాను. రిజల్ట్‌ నా చేతిలో ఉండదు' అంటూ కేతిక చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు