Raj Kundra Arrest: బంధువులతో కలిసి దందా నడిపిన రాజ్‌ కుంద్రా!

21 Jul, 2021 12:11 IST|Sakshi

Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్‌లో తన బంధువులతో కలిసి రాజ్‌ కుంద్రా నీలి చిత్రాల దందా చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌, ఈ మెయిల్‌ ద్వారా ఈ చీకటి వ్యవహారం గుట్టును బయటపెట్టారు.

బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్‌ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్‌లలో అప్‌లోడ్‌ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్‌ కుంద్రాను పోలీస్‌ కస్టడీలో ఉంచనున్నారు.ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసునమోదైందని ముంబై పోలీసు కమిషనర్‌హేమంత్ నాగ్రాలే ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు