కేజీఎఫ్‌ 2 రిలీజ్: యోధుడొస్తున్నాడు

29 Jan, 2021 18:55 IST|Sakshi

చెప్పిన సమయానికల్లా టంచనుగా అప్‌డేట్‌ ఇచ్చింది కేజీఎఫ్‌ 2. జూలై 16న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో త్వరలోనే రాకీ భాయ్‌ వచ్చేస్తున్నాడోచ్‌ అంటూ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రమే కేజీఎఫ్‌ చాప్టర్‌ 2. 2018లో బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఇందులో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. రవీనా టాండన్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 విడుదల కానుంది.   (చదవండి: ‘పుష‍్ప’ షూటింగ్‌లో విషాదం : షాక్‌లో అభిమానులు)

ఇక కేజీఎఫ్ 2‌ దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు జూలైలో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. కాకపోతే ఈ సినిమా విడుదలైన సుమారు నెల రోజులకు అంటే ఆటస్లు 13కు అల్లు అర్జున్‌ 'పుష్ప' రిలీజ్‌ కానుంది. అయినా కేవలం టీజర్‌కే కోట్ల వ్యూస్‌ సాధించి రికార్డులు బద్ధలు కొట్టిన కేజీఎఫ్‌.. థియేటర్లలో వసూళ్ల సునామీ కురిపించేందుకు మరీ ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. కాబట్టి కేజీఎఫ్‌, పుష్ప ఢీకొట్టే ఛాన్స్‌ లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఏదేమైనా కేజీఎఫ్‌ రచ్చ చూడాలంటే మరో ఐదు నెలలు ఆగాలి. (చదవండి: కేజీఎఫ్‌ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు