కేజీఎఫ్ ‌2: మాట నిలెబెట్టుకుంటోంది!

29 Jan, 2021 15:11 IST|Sakshi

గతేడాది సినిమా లేక బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవం వచ్చేటట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌లో సినిమాలే రిలీజ్‌ చేయలేని హీరోలు ఓవైపు కథలు వింటూనే మరోవైపు పూర్తి చేసిన ప్రాజెక్టులను రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో సినిమాలు రిలీజ్‌ డేట్స్‌ ప్రకటించేశాయి. అయితే అందరు హీరోలు అప్‌డేట్‌ ఇస్తున్నారు, మా రాఖీ భాయ్‌ మాత్రం ఇంకా గమ్మునుండిపోయాడు అని అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్తున్నాడు కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. అమ్మ ప్రేమను, బానిస బతుకులను గోడును, వారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే వీరుడి గాధను కళ్లకు కట్టి చూపించిన చిత్రమే కేజీఎఫ్‌. దానికి సీక్వెల్‌గా వస్తోంది కేజీఎఫ్‌ 2. (చదవండి: "మాటివ్వు.. రాఖీ!’’అమ్మ ఒట్టేయించుకుంది)

నేడు సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామంటున్నారు. ఆ మరుక్షణమే సోషల్‌ మీడియాలో ప్రభంజనం రావడం ఖాయం అంటున్నారు అభిమానులు. ​కాగా గతంలో ఈ సినిమా టీజర్‌ జనవరి 7న యశ్‌ బర్త్‌డేకి ఒకరోజు ముందు రిలీజ్‌ అయింది. 48 గంటల్లో యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. దీంతో అభిమానుల సంతోషం మాటల్లో చెప్పలేనిది. మరి రెండేళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న ఈ సినిమా బాక్సాఫీసులో అడుగు పెడితే రికార్డులు కొల్లగొట్టడం ఖాయమే.ఈ భారీ బడ్జెట్‌ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. (చదవండి: లిఫ్ట్‌లో అనసూయకు పురిటినొప్పులు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు