KGF Yash: బాహుబలి తర్వాత ఆ సీన్ మారింది.. ఆ క్రెడిట్ మాత్రం ఆయనకే: యశ్‌

6 Nov, 2022 15:34 IST|Sakshi

కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. 

(చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్‌‌ హీరో.. కరణ్ జోహార్‌ క్లారిటీ..!)

కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే  పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. 

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్‌ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్‌ అన్నారు. ‘కేజీయఫ్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్‌ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్‌-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్‌లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు.

(చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్‌ బ్యూటీ!)

మరిన్ని వార్తలు