కె.జి.యఫ్ నుంచి మరో అప్​డేట్

31 May, 2021 11:02 IST|Sakshi

కె.జి.యఫ్​తో కన్నడ సినిమాకు కొత్త వైభవం తీసుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. రాకింగ్ స్టార్​ యశ్​ లీడ్ రోల్​ చేసిన ఈ మూవీ సెకండ్ ఛాప్టర్​ కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. కరోనా ఎఫెక్ట్​తో అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ నుంచి మరో అప్​డేట్ అందింది. 

కె.జి.యఫ్​ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితా ఒకటి. మొదటి పార్ట్​లో ముఖాలు చూపించని కొన్ని క్యారెక్టర్లను.. రెండో ఛాప్టర్ కోసం ఒక్కోక్కటిగా పోస్టర్లతో రివీల్ చేస్తోంది ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిల్మ్స్. అది కూడా పుట్టినరోజులకు, పేపర్​ కట్టింగ్​లతో కావడం మరో విశేషం. కాగా, ఈరోజు మరో పోస్టర్​ను రివీల్ చేశారు. ఈ మూవీలో ఇనాయత్​ ఖలీల్​ క్యారెక్టర్​ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్​ను రిలీజ్​ చేసింది నిర్మాణ సంస్థ. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్​ ఖలీల్​ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ క్యాప్షన్​ ఉంచింది. దుబాయ్​లో ఉంటూ ఇండియాపై కన్నేసే గోల్డ్​ స్మగ్లర్ల డాన్​గా ఇనాయత్​ ఖలీల్​ రోల్​ ఉండబోతోంది.

కాగా, బాలకృష్ణ టాలీవుడ్ నటుడు ఆదర్శ్​ బాలకృష్ణ తండ్రి. ఈ ఫ్యామిలీతో దర్శకుడు ప్రశాంత్​ నీల్​కు దగ్గరి చుట్టరికం ఉంది. ఇక గతంలో కె.జి.యఫ్​ వికీపీడీయా పేజీలో తెలుగు సీనియర్​ హీరో నందమూరి బాలకృష్ణ పోస్టర్​ని, ఇన్ఫోని కొందరు సరదాగా ఎడిట్ చేసిన విషయం తెలిసిందే.   కాగా, వంద కోట్ల బడ్జెట్​తో పీరియాడిక్​ యాక్షన్​ ఫిల్మ్​గా తెరకెక్కిన కె.జి.యఫ్​ లో యశ్​, శ్రీనిధి శెట్టి,  ప్రకాశ్​ రాజ్​, రవీనా టండన్​, సంజయ్​ దత్, రావు రమేశ్​​లు నటిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు