కేజీఎఫ్‌ 2 బిజినెస్‌ అన్ని కోట్లా?

6 Feb, 2021 20:57 IST|Sakshi

ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ సినిమాగా నిలిచింది‌.  ఈ ఒక్క సినిమాతో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం  కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ  సినిమా కోసం అన్ని భాషల  ఆడియన్స్  ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో రెండో భాగం బిజినెస్‌కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. 

అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం ఉంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెజిఎఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా 250 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మాత్రం కేజీఎఫ్‌ 2 బిజినెస్ భారీగానే జరుగుతుంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు